నేను దేశ గురువును.. మీ ఊరికి కీడు సోకింది.. అందుకే వచ్చా

|

Aug 09, 2024 | 2:04 PM

ఆధునిక యుగంలోనూ ఇంకా మూఢనమ్మకాలతో అనేకమంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. వారి మూఢవిశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని రోజుకో బాబా పుట్టుకొస్తున్నాడు. తమ మాయ మాటలతో ప్రజలను మోసం చేసి డబ్బు దండుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో గుర్రంపై స్వైర విహారం చేస్తున్న ఓ వ్యక్తి విచిత్ర వేషాధారణతో జనానికి శఠగోపం పెట్టాడు.. మీ ఊరిపై క్షుద్రశక్తులు ఆవహించాయి, కీడు సోకిందని నమ్మించి వేలాది రూపాయలు దండుకున్నాడు..

ఆధునిక యుగంలోనూ ఇంకా మూఢనమ్మకాలతో అనేకమంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. వారి మూఢవిశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని రోజుకో బాబా పుట్టుకొస్తున్నాడు. తమ మాయ మాటలతో ప్రజలను మోసం చేసి డబ్బు దండుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో గుర్రంపై స్వైర విహారం చేస్తున్న ఓ వ్యక్తి విచిత్ర వేషాధారణతో జనానికి శఠగోపం పెట్టాడు.. మీ ఊరిపై క్షుద్రశక్తులు ఆవహించాయి, కీడు సోకిందని నమ్మించి వేలాది రూపాయలు దండుకున్నాడు.. అతగాడి మోసాలను గమనించిన యువకులు నిలదీయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి తన అనుచరులతో గ్రామంలో గుర్రం పై చక్కర్లు కొడుతూ, డప్పు చాటింపు వేయిస్తూ.. మీ ఊరికి కీడు సోకిందని ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు తప్పవంటూ గ్రామస్తులను నమ్మించాడు. జయపురం గ్రామంలోకి ప్రవేశించిన ఈ గుర్రం బాబా డప్పు చప్పుళ్ళతో గుర్రంపై స్వారీ చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ తాను దేశ గురువును, మీ గ్రామం బాగు కోసం వచ్చాను, మీ అందరి బాగు కోసం నేను పూజలు చేస్తాను.. మిమ్మల్ని కాపాడుతాను అంటూ చాటింపు వేసాడు. ఈ గుర్రం బాబా మాయలో పడిన గ్రామస్తులు గుర్రంబాబా వెంటపడ్డారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం

రూ.10 కాయిన్‌ చెల్లదంటే చెరసాలే !! కఠిన చర్యలు తప్పవంటూ ఆర్బీఐ హెచ్చరికలు

చలియార్ నదిలో కొట్టుకొస్తున్న మానవ అవయవాలు

అణుయుద్ధమే జరిగితే ?? 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది ప్రాణాలొదిలే ప్రమాదం

అంత్యక్రియల పేరుతో మోసం శవాలను దాచేసి.. చితాభస్మంగా బూడిద ఇచ్చారు

Follow us on