రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
గుంటూరు జిల్లా తెనాలిలో భారీ బంగారు, వెండి ఆభరణాల పట్టివేత స్థానికంగా సంచలనం సృష్టించింది. ఓ రేకుల ఇంట్లో నివసించే గురవమ్మ నివాసంపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేయగా, ₹1.5 కోట్ల విలువైన 800 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి లభ్యమయ్యాయి. ఈ సొత్తు తన అల్లుడు గురునాథంకు చెందినవని గురవమ్మ చెప్పగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురునాథం పరారీలో ఉన్నాడు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని బాలాజీ రావుపేట, మహేంద్ర కాలనీలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాలనీలోని ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్న గురవమ్మ ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు బయటపడటంతో పోలీసులు కూడా విస్తుపోయారు. గురవమ్మ భర్త పొట్టు బండి తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెను విజయవాడకు చెందిన గురునాథంకు ఇచ్చి వివాహం చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ వకుల్ జిందాల్‌కు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు గురవమ్మ ఇంటిపై దాడి చేసి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. రేకుల ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో ఆభరణాలు లభించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అవి తన అల్లుడు గురునాథంకు చెందినవేనని గురవమ్మ పోలీసులకు తెలిపింది. విజయవాడలోని ఓ చాక్లెట్ కంపెనీలో గురునాథం పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఇప్పటివరకు గురునాథంకు సంబంధించిన నేర చరిత్ర ఏదీ బయటపడలేదు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా
బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు