బనానా పానీపూరీ !! భయపడుతూనే గుటకలేస్తున్న నెటిజన్లు

|

Jul 01, 2023 | 9:00 AM

పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపెద్దా ఎంతో ఇష్టంగా ఈ స్ట్రీట్‌ పుడ్‌ను తింటారు. సాయంత్రం అయిందంటే చిన్నా పెద్దా అంతా పానీపూరీ బండి చుట్టూ చేరతారు. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల వెరీటీల్లో పానీపూరీ చేస్తుంటారు పానీపూరి స్టాల్ ఓనర్లు. అలాంటి ప్రయత్నమే చేశాడు ఓ వ్యాపారి.

పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపెద్దా ఎంతో ఇష్టంగా ఈ స్ట్రీట్‌ పుడ్‌ను తింటారు. సాయంత్రం అయిందంటే చిన్నా పెద్దా అంతా పానీపూరీ బండి చుట్టూ చేరతారు. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల వెరీటీల్లో పానీపూరీ చేస్తుంటారు పానీపూరి స్టాల్ ఓనర్లు. అలాంటి ప్రయత్నమే చేశాడు ఓ వ్యాపారి. పానీపూరిలో స్టఫ్ కోసం బంగాళదుంపలు, టమోటాలు, బఠానీలు, కొత్తిమీరను వేసిచేయడం సహజం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం పానీపూరీలో ఆలూకి బదులు అరటిపండును ఉపయోగించాడు. దాన్ని కొందరు కస్టమర్లు కూడా లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తుంటే.. కొందరు మాత్రం తినాలనే ఉంది కానీ ఆ తర్వాత ఏమౌతుందో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ పానీపూరీ చేసే వ్యక్తి అరటిపండు, శెనగలు, మసాలా దినుసులు, పచ్చి కొత్తిమీర వేసి కస్టమర్స్‌కి అందిస్తున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వింత ఆచారం.. సమాధులు తవ్వి శవాలపై నీళ్లు చల్లుతున్నారు !! ఎందుకో తెలిస్తే షాకే

ఎయిర్‌ ఇండియా విమానంలో మళ్లీ అదే చెండాలం !! అసలు ఏం జరిగిందంటే ??

క్లీనర్‌ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..

15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్‌ రికార్డ్‌.. కానీ..

మేకలలో కింగ్‌.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్