దేవుడి ప్రసాదాన్ని దొంగిలిస్తారు.. ఎక్కడంటే

Updated on: Oct 27, 2025 | 2:52 PM

పండగ వేళ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తారు. వినాయక చవితి సందర్బంగా గణపతి దగ్గర పెట్టిన లడ్డుని దొంగతనం చేస్తే కలిసి వస్తుందని నమ్ముతారు. అందుకే లడ్డు చోరీ కాకుండా కాపలా కూడా పెడతారు. గుజరాత్‌లో దేవుడి ప్రసాదాన్ని లూటీ చేయడానికి జనాలు భారీగా పోటీ పడతారు. ఏకంగా 80 గ్రామాల ప్రజలు ఇందుకోసం పోటీ పడతారు.

ఒకరి మీద ఒకరు పడి మరీ ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఆసక్తి చూపుతారు. ఈ ఘటన రాష్ట్రంలో ప్రతి ఏటా జరుగుతుంది. గుజరాత్‌లోని ఖేడాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం రంఛోడిరాజి ఆలయంలో దీపావళి రెండో రోజున ఈ వేడకను నిర్వహిస్తారు. దేవుడి దగ్గర సమర్పించిన ప్రసాదాన్ని లూటీ చేయడానికి జనం పోటీ పడతారు. పైగా దీన్నో వేడుకలా చేసుకుంటారు జనాలు. దీన్ని అన్నకూట్ ఉత్సవం అంటారు. దాదాపు 250 సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఈ సంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఆలయం చుట్టుపక్కల 80 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. రంఛోడరాజి ఆలయంలో 3 వేల కిలోల అన్నప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. పూజ అనంతరం ఈ అన్నప్రసాదాన్ని భక్తులకు పంచి పెట్టరు. దీన్ని లూటీ చేయడం కోసం చుట్టుపక్కల 80 గ్రామాల ప్రజలు పోటీ పడతారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ.. ఒకరి మీద మరొకరు పడుతూ.. ఈ ప్రసాదాన్ని దొంగిలిస్తారు. అన్నప్రసాదానికి మహాహారతి కార్యక్రమం ముగిసిన తర్వాత.. దీనిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడతారు. పూజ ముగిసన తర్వాత.. ఈ అన్నప్రసాద్‌ను తీసుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. దీంతో వందలాది మంది ప్రజలు గుంపులుగా తరలి వచ్చి.. దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని లూటీ చేస్తారు. ఇలా చేయటాన్ని ఓ పండుగలాగా జరుపుకుంటారు. అన్నకూట్ ఉత్సవం పేరిట జరిగే ఈ వేడుకను చూసేందుకు భారీ ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో కృష్ణుడిని ప్రార్థిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రెడిట్‌ స్కోర్‌ ఎంతకీ పెరగట్లేదా ?? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి

అంధులకు కంటిలో చిప్‌ .. టెక్నాలజీ ద్వారా చూపు

కిచెన్‌లో ఏఐ అసిస్టెంట్‌క్షణాల్లో కావాల్సిన రెసిపీ రెడీ

Diabetes: నిద్రతో డయాబెటిక్‌కు చెక్‌..