బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానం రద్దు కావడంతో ఓ పెళ్ళికొడుకు హైదరాబాద్‌కు వెళ్లలేక ఇబ్బందులు పడ్డాడు. తన పెళ్ళిబట్టలు లగేజీలో ఉండిపోవడంతో ఆందోళన చెందాడు. ఇండిగో సిబ్బంది స్పందించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, గోవా, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానం రద్దు కావడంతో పెళ్ళికి వెళ్లాల్సిన ఓ యువకుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఈ యువకుడు, ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. తన బ్యాగేజీ వెనక్కి ఇవ్వమని బతిమాలినా ఇండిగో సిబ్బంది నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్ళిబట్టలన్నీ లగేజీలో ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. కార్లో వెళ్లాలనుకున్నా, బట్టలు లేకపోవడంతో వేచి చూడక తప్పలేదు. ఈ కష్టాన్ని టీవీ9తో పంచుకున్నాడు. ఇదే పరిస్థితి హైదరాబాద్, గోవా, బెంగళూరులోని అనేక విమానాశ్రయాల్లో కనిపించింది. ప్రయాణికులు సమాచారం లేక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
