అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్

Updated on: Sep 24, 2025 | 6:45 PM

దసరా నవరాత్రుల సందడి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో కొలుస్తున్నారు భక్తులు. అయితే ఒక చోట మాత్రం విగ్రహం లేకుండానే పూజలు చేస్తున్నారు. విగ్రహానికి బదులుగా కలశాన్ని స్థాపించి పూజలు చేస్తున్నారు. దుర్గామాత విగ్రహానికి బదులు శక్తికి ప్రతీకగా కలశాన్ని స్థాపించి పూజలు చేస్తున్నారు గూర్ఖా సైనికులు. మరీ ముఖ్యంగా 'ఝార్ఖండ్ సాయుధ పోలీస్ 1' గూర్ఖా సైనికులు కలశ స్థాపన సమయంలో తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి వందనం సమర్పించారు.

ఈ సంప్రదాయాన్నిగూర్ఖా సైనికులు 1880 నుంచి కొనసాగిస్తున్నారు. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచింది గూర్ఖా సైనిక బెటాలియన్. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1815 నుంచి గూర్ఖా బెటాలియన్‌ రెజిమెంట్లు బ్రిటీష్ ఇండియా ఆర్మీలో పని చేసేవి. ఆ తర్వాత అవి భారత ఆర్మీలో చేరాయి. ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిర్వహించే ఆపరేషన్లలో.. వీఐపీలకు భద్రత కల్పించే వ్యవహారాల్లో వీరు పనిచేస్తున్నారు. దుర్గామాత ప్రసాదించే శక్తి వల్లే తమలో ధైర్య సాహసాలు ఉంటాయని ‘ఝార్ఖండ్ సాయుధ పోలీస్ 1’ గూర్ఖా బెటాలియన్ సైనికులు నమ్ముతారు. అందుకే రాంచీలో వీరు 1880 నుంచి ఏటా దేవీ శరన్నవరాత్రులను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు దుర్గామాత కలశం చుట్టూ గూర్ఖా సైనికుల భార్యలు, కుటుంబాల్లోని ఇతర మహిళలు కూర్చొని పూజలు చేస్తారు. దుర్గామాతను ప్రసన్నం చేసుకునేందుకు జపాలు చేస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి

డాన్స్‌ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్‌.. సీన్ కట్ చేస్తే..

Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!

ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం