విద్యార్థులకు శుభవార్త !! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్‌

|

Oct 28, 2024 | 7:50 PM

10వ తరగతి విద్యార్థులకు 20 మార్కులు వచ్చినా పాస్‌ చేస్తారు. అదెలా అంటారా? దీనికీ ఓ కండిషన్‌ ఉంది. తెలుగు సబ్జెక్టులో అది కూడా 10వ తరగతిలో తెలుగు సబ్జెక్టును సెకండ్ ల్యాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్ధులకు మాత్రమే పబ్లిక్‌ పరీక్షల్లో 20 మార్కులు వచ్చినా పాస్‌ చేస్తారు. తెలుగు మాతృభాషగాలేని విద్యార్ధులు తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా ఎంచుకుంటేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

కానీ మహారాష్ట్ర స్కూళ్లల్లో మెయిన్‌ సబ్జెక్ట్‌లైన మ్యాథ్స్‌ సైన్స్‌ లో 20 మార్కులకే పాస్‌ చేస్తున్నారు. నమ్మలేకపోతున్నారా అయితే ఈ స్టోరీ చూడండి. మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులంటే భయపడే విద్యార్థులపై మహారాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ఇకపై పదవ తరగతి పరీక్షల్లో సైన్స్‌, మ్యాథ్స్‌లో 20 మార్కులు వస్తే పాస్‌ అయినట్లు పరిగణిస్తామని తెలిపింది. గతంలో ఈ సబ్జెక్టులలో పాస్‌ కావాలంటే 100కు 35 మార్కులు తప్పనిసరిగా రావాలనే నిబంధన ఉంది. ఇంత మంచి వార్త చెప్పిన రాష్ట్ర ‍ప్రభుత్వం ఇలా పాసయ్యేవారి విషయంలో మరో మెలికకూడా పెట్టింది. వారు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక వారి మార్క్‌షీట్‌లో ఇకపై సదరు విద్యార్థి మ్యాథ్స్, సైన్స్ చదవలేరని రాస్తారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ రాహుల్ రేఖావర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్పు పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ఆమోదించిన కొత్త పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లో ఓ భాగం. రాష్ట్రంలో కొత్త పాఠ్యాంశాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ శరద్ గోసావి తెలిపారు. హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరవేగంగా రూపుదిద్దుకుంటున్న.. రామ్‌చరణ్‌ మైనపు బొమ్మ

కుక్క వెంటపడి.. థర్డ్ ఫ్లోర్‌ నుంచి కింద పడ్డ యువకుడు

ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్

Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్‌ హీరో..

Follow us on