Free Condoms: ప్రేమికులకు బంపర్ ఆఫర్.. వాలంటైన్స్‌డే రోజున ఫ్రీ కండోమ్స్ పంపిణీ.. వీడియో.

|

Feb 09, 2023 | 9:39 PM

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు 95 మిలియన్ల కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆ రోజునే చేస్తారని అనుకోకండి.. ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్...

ప్రపంచవ్యాప్తంగా జరుపునే వేడుకలలో వాలెంటైన్స్ డే కూడా ఒకటి. ప్రేమికుల కోసమే అంకితం చేసిన దినోత్సవం ఇది. అందుకే ప్రేమికుల సౌలభ్యం కోసమే అన్నట్టుగా.. ప్రేమికులు ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా ఓ దేశం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆదేశంలోని ప్రేమికులకు 95 మిలియన్ల కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దేశం మరేదో కాదు.. పర్యాటకులు స్వర్గధామంగా భావించే థాయిలాండ్. అవును.. థాయిలాండ్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా 95 మిలియన్ల కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొత్తం ఆ రోజునే చేస్తారని అనుకోకండి.. ఫిబ్రవరి 1 నుంచే థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది.ఒక దేశ ప్రభుత్వం ఆ దేశ పౌరులకు ఫ్రీగా కండోమ్స్ పంపిణి చేస్తోందంటే.. జనాభా పెరగకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయమని అనుకుంటారు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేస్తున్నారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. ఎక్కడో తేడా కొడుతోంది అనిపిస్తోంది కదా..! అవును.. మీరు అనుకున్నది నిజమే. కాకపోతే ఇలా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేయడంలో కూడా ప్రజాహితం ఉందంటోంది థాయిలాండ్ ప్రభుత్వం. థాయిలాండ్ ప్రభుత్వం చెబుతున్న ప్రజా ప్రయోజనం ఏమిటంటే.. వాలెంటైన్స్ డే కంటే ముందుగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేయడం వల్ల సుఖ వ్యాధులు వ్యాపించకుండా ఉండటంతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీని నివారించవచ్చని చెబుతోంది. అయితే థాయిలాండ్ తీసుకున్న ఈ నిర్ణయంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనం సంగతి అంటుంచితే.. థాయిలాండ్ ప్రభుత్వం పరోక్షంగా ఏం ప్రోత్సహిస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు ఆ దేశ ప్రజలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..