పాపం.. వృద్ధురాలని కూడా చూడకుండా నడి రోడ్డుపై ..

Updated on: Dec 01, 2025 | 7:08 PM

బంగారం ధరలు పెరగటంతో చైన్ స్నాచింగ్ నేరాలు అధికమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో వృద్ధురాలిపై కారం కొట్టి, పుస్తెలతాడు తెంపుకొని పారిపోయిన ఘటన మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. బంగారు ఆభరణాలు ధరించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన, బంగారానికి పెరుగుతున్న విలువ నేరాలను ఎలా పెంచుతుందో తెలియజేస్తుంది.

బంగారం ధరలు అమాంతం పెరగటంతో ఇప్పుడు అందరి కళ్ళూ బంగారం పైనే పడింది. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు చైన్ స్నాచింగ్స్ కి సైతం పాల్పడుతున్నారు. బంగారం కోసం అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు మహిళలు. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్ట గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం రాగోలు అన్నపూర్ణ అనే వృద్ధురాలు పొలం నుంచి ఇంటికి వెళుతోంది. ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆమెను ఎక్కడినుంచి గమనించాడో తెలియదు కానీ ఆమెను వెంబడించిన ఓ దుండగుడు వృద్ధురాలి కంట్లో కారం కొట్టాడు. ఆ వెంటనే ఆమెపై ఎటాక్‌ చేసి మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. కళ్లలో కారం కొట్టడంతో బాధతో విలవిల్లాడిన వృద్ధురాలు లబోదిబోమంటూ ఆర్తనాదాలు చేసింది. అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులు వృద్ధురాలి వద్దకు వచ్చి జరిగింది తెలుసుకొని ఆమె కళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న పురుగు.. పెద్ద ప్రమాదం.. తస్మాత్‌ జాగ్రత్త

పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చిన భర్త.. అలా ఎలా చేసావ్ భయ్యా

అమ్మవారి గుడికి వెళ్లిన భక్తులు..దెబ్బకి వెనక్కి పరుగు..

కోనసీమలో ఆకట్టుకుంటున్న గోవా బీచ్..

జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు మాయం