గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

Updated on: Apr 22, 2025 | 4:28 PM

గోల్కొండ బ్లూ డైమండ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. మేలో జెనీవాలో జరగనున్న క్రిస్ట్రీ వేలం పాటలో ఈ డైమండ్ అమ్మకానికి రానుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ తర్వాత అంతటి అద్వితీయమైన వజ్రంగా గోల్కొండ బ్లూ డైమండ్కు పేరుంది. వేలంలో దాని ధర 350 నుంచి 450కోట్ల రూపాయలు పలకవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

ఒకప్పుడు భారతదేశ రాచరికానికి చిహ్నంగా వెలుగొందిన ఈ బ్లూ డైమండ్ ఇండియా నుంచి బయటకు ఎలా వెళ్లింది? ఎంత మంది చేతులు మారింది.? అసలు ఆ వజ్రం చరిత్ర ఏంటి..? పర్షియా నుంచి వచ్చిన కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ కేంద్రంగా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. పదకొండో శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోటపై నుంచి చూస్తే నగరం ఎంతో అద్భుతంగా కనిపించేదట. గోల్కొండ అతి పెద్ద కోటకే కాదు, అందమైన వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇవి అద్భుతమైన మెరుపును కలిగి ఉంటాయి. వీటిని ముక్కలు చేయడం చాలా కష్టం. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండను ప్రపంచ వజ్రాల పరిశ్రమగా చెప్పుకునేవారు. 14వ శతాబ్దం చివరలో గోల్కొండ ప్రాంతంలో డైమండ్లను వీధుల్లో రాశులు పోసి అమ్మేవారట. వాటిని కొనేందుకు వర్తకులు దేశవిదేశాల నుంచి వచ్చేవారట. ముఖ్యంగా పర్షియన్లు, అరబ్బులు వీటిని ఎంతో ఇష్టంగా కొనుక్కునేవారని చరిత్రకారులు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత షాకింగ్‌ ?? భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్..

Rashmi Gautam: తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..