నెయిల్ పాలిష్ వేసుకుంటూ స్పృహ తప్పిన చిన్నారి.. CT స్కాన్ చేయగా..

Updated on: Feb 10, 2025 | 5:44 PM

ఆ చిన్నారి ముందు రోజు రాత్రి హలోవిన్ పార్టీ ముగించుకుని.. మరుసటి రోజు ఎంచక్కా తల్లితో నెయిల్ పాలిష్ పెట్టించుకుంది. తీరా అలా నెయిల్ పాలిష్ పెట్టించుకుందో.. లేదో.. అనూహ్యంగా స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. ఈ స్టోరీ వివరాలు ఏంటంటే... ఇంగ్లాండ్‌లోని ఎల్లెస్మెర్ పోర్ట్ నివాసి అయిన 5 ఏళ్ల ఎల్లా.. సంతోషంగా తన తల్లి గెమ్మ గ్రిఫిత్స్‌తో చేతి వేళ్లకు నెయిల్ పాలిష్ చేయించుకుంది.

అయితే ఏం జరిగిందో ఏమో గానీ.. అనూహ్యంగా కొద్దిసేపటికి ఆమె శ్వాస ఆగిపోయి.. అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ వెంటనే తల్లి ఆమెకు CPR చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో హుటాహుటిన ఎల్లాను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు సదరు చిన్నారికి పరీక్షలు చేయగా.. ఆమె కోమాలోకి వెళ్లిందని బాంబ్ పేల్చారు. వైద్యులకు మొదటిగా ఆమె పరిస్థితి అర్ధంకాలేదు. అయితే చిన్నారికి CT స్కాన్ చేసిన అనంతరం ఆమెకు రెండోసారి గుండెపోటు వచ్చిందని తేల్చారు. ఆ చిన్నారి పరిస్థితి చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ఎల్లా వెంట్రిక్యులర్ టాచీకార్డియాఅనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీని వల్ల హార్ట్ రేటులో హెచ్చుతగ్గులు ఉండటమే కాకుండా గుండెపోటు వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందట. మరోవైపు చిన్నారి అలసిపోవడానికి గల కారణాలను ఆమె తల్లిని అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు. ఆ ముందు రోజు రాత్రి హాలోవీన్ పార్టీలో ఎల్లా చాలా అలసిపోయి ఇంటికి వచ్చిందని ఆమె తల్లి చెప్పుకొచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఏనుగు బలానికి JCB షేక్

మైండ్‌ఫుల్‌నెస్‌ గురించి విన్నారా? ప్రాక్టీస్ చేస్తే సూపర్ రిజల్ట్

మంచి హోటల్‌, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే

త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెస‌ర్ కీల‌క నిర్ణయం

బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఇద్దరు అమ్మాయిల సిగపట్లు