Giraffe on Lovers: ప్రియురాలికి పెళ్ళి ప్రపోజల్‌.. షాక్‌ ఇచ్చిన జిరాఫీ.. ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు..

ప్రేమికులకు ప్రపోజల్‌ ఘట్టం అత్యంత ముఖ్యమైనది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నాతో జీవితాన్ని పంచుకోవడం నీకు ఇష్టమేనా" అని అడుగుతూ ప్రియుడు లేదా ప్రియురాలు ప్రపోజ్ చేస్తారు.

Giraffe on Lovers: ప్రియురాలికి పెళ్ళి ప్రపోజల్‌.. షాక్‌ ఇచ్చిన జిరాఫీ.. ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు..

|

Updated on: Aug 01, 2022 | 5:25 PM


ప్రేమికులకు ప్రపోజల్‌ ఘట్టం అత్యంత ముఖ్యమైనది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నాతో జీవితాన్ని పంచుకోవడం నీకు ఇష్టమేనా” అని అడుగుతూ ప్రియుడు లేదా ప్రియురాలు ప్రపోజ్ చేస్తారు. ఎక్కువగా లవర్సే ప్రపోజ్ చేసి.. రింగును గిఫ్టుగా ఇస్తుంటారు. ఇలా ప్రేమను వ్యక్తం చేసి.. వారి ప్రేమను గెలుచుకోవడం అనేది ఎంతో భావోద్వేగ అంశం. అందుకే దాని కోసం సరైన ప్లేస్, సరైన సందర్భం చూసి వ్యక్తం చేస్తారు. అదే విధంగా… ఓ యువకుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఓ సఫారీ పార్కును ఎంచుకున్నాడు. అంతా సవ్యంగా జరగాలనీ.. ఆమె ప్రేమను పొందాలని ఆశించాడు. కానీ ఓ జిరాఫీ వారికి షాక్ ఇస్తుందని ఇద్దరూ ఊహించలేదు. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది.

తన ప్రియురాలు మోంటెర్రాట్ కాక్స్‌కి లవర్ ప్రపోజల్ చేస్తుండగా… వారి దగ్గరకు ఓ జిరాఫీ వచ్చింది. అక్కడ టూరిస్టుల దగ్గరకు అవి రావడం కామనే. అందువల్ల జిరాఫీని చూసి.. సరైన సమయంలో అది భలే వచ్చింది అనుకున్నారు. తమ ప్రపోజల్ వీడియో మరింత బాగా వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే… ఆ జిరాఫీ తన తలతో ఆమె తలను వెనక్కి వంచి దాడి చేసింది. ఊహించని ఈ పరిణామంతో ఆ జంట ఉలిక్కిపడింది. జిరాఫీ వల్ల ఇప్పుడు ఆమె ఓ వారం పాటూ నెక్ కాలర్‌ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా అతని ప్రేమను ఆమె అంగీకరించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us