Health tips: ఈ రెండు తీసుకోండి చాలు.. బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు..! అవేంటంటే..

|

Apr 26, 2022 | 10:02 PM

ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు. అవేంటంటే..


ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు. అవేంటంటే.. వెల్లులి, బీట్‌రూట్‌. ఈ రెండూ గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో అద్భుతమైన ఔషధాలుగా పని చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ క్రిస్ వాన్ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాల్ని బయట పెట్టింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ఈ రెండు పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని తెలిసింది.28 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం చేశారు. రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు మ్యాగ్జిమమ్ బీపీ వీరిలో 130 వరకూ ఉంది. సాధారణంగా 120 ఉండాలి. ఆ తరువాత వీరిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి..3 వారాల వరకూ వెల్లుల్లి, బీట్‌రూట్ ఇచ్చారట. అయితే వీరిలో బీపీ 2 నుంచి 3 పాయింట్లు తగ్గిందట. అటు హార్ట్ అటాక్ ముప్పు కూడా పది శాతం తగ్గిందని చెబుతున్నారు. ఇది కేవలం 3 వారాల అధ్యయనంతో తేలిన విషయం మాత్రమే. ఇలా రెండు మూడు నెలలు కంటిన్యూగా తీసుకుంటే బీపీ మరింతగా తగ్గే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ రెండూ తీసుకోవడం వల్ల రక్తనాళం వ్యాకోచించి..రక్తం సులభంగా ప్రవహిస్తుందట.

మరిన్ని చూడండి ఇక్కడ:

David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Follow us on