Giant Panda Cub: సందర్శకులను ఆకట్టుకుంటున్న చిన్నారి పాండా..సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో..

Giant Panda Cub: కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఒక జెయింట్ పాండా పిల్ల పుట్టింది. బుజ్జిగా ఉన్న ఆ పిల్ల పాండాను కరోనా పరిస్థితుల్లో వర్చువల్ విధానంలో మాత్రమే ప్రజలకు చూపించారు.

Giant Panda Cub: సందర్శకులను ఆకట్టుకుంటున్న చిన్నారి పాండా..సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో..
Giant Panda Cub

Updated on: May 23, 2021 | 8:35 PM

Giant Panda Cub: కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో ఒక జెయింట్ పాండా పిల్ల పుట్టింది. బుజ్జిగా ఉన్న ఆ పిల్ల పాండాను కరోనా పరిస్థితుల్లో వర్చువల్ విధానంలో మాత్రమే ప్రజలకు చూపించారు. శుక్రవారం దీనిని మొదటిసారిగా ప్రజలకు నేరుగా చూసే అవకాశం కల్పించారు. ఈ బుజ్జి పాండా వాషింగ్టన్ జాతీయ జంతు ప్రదర్శనశాలలో ఉంది. చిన్నారి పాండాను చూడటానికి జూకి వచ్చిన వారంతా ఆసక్తి చూపించారు. ఈ బుజ్జి పాండాకి పేరు కూడా పెట్టేశారు. జియావో క్వి జి దీని పేరు. ఇది టియాన్ టియాన్, జియాంగ్ అనే పాండాలకు పుట్టింది. ఆగస్టులో 22 ఏళ్ల జియాంగ్ ఈ బుజ్జి పాండాకి జన్మనిచ్చింది. ఇంతకు ముందు ఈ పాండా కు మూడు పిల్లలు పుట్టాయి. ఇప్పుడు ఈ జియావో క్వి జి నాలుగో ఆరోగ్యకరమైన బుజ్జిది. నాలుగోసారి పాండా పిల్లను కంటుందని తెలిసిన జూ అధికారులు చాలా సంబర పడ్డారు. దానిని జాగ్రత్తగా సాకారు. కరోనా సమయం కావడంతో ప్రత్యెక శ్రద్ధ తీసుకున్నారు.

ఈ బుజ్జి పాండా వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు. అదిక్కడ చూడొచ్చు..

స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూషన్‌లో భాగమైన నేషనల్ జూ శుక్రవారం 20 శాతం సామర్థ్యంతో తిరిగి తెరుచుకుంది. రోజుకు 5,000 నుండి 6,000 మంది సందర్శకులకు ప్రవేశ అవకాశం కల్పిస్తున్నారు. అంతకు ముందు ఈ జూ ప్రతిరోజూ 20 వేల మంది సందర్శకులకు అనుమతి ఉండేది. కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు జూలై 2020 లో జూ మూసివేశారు. దీని వల్ల చిన్ని పాండా ప్రజలకు చూపించడానికి ఆలస్యం అయింది. అయితే, ఇప్పుడు జూకి వెళ్ళేవారు ఈ చిన్నారి పాండాను చూడగలుగుతారు.

రద్దీని తగ్గించడానికి, జూ సమయం ప్రారంభానికి ముందు ఎంట్రీ పాస్‌లను జారీ చేస్తున్నారు. అలాగే జూకి వచ్చే వారు వన్-వే మార్గాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని ఆ జూ వెబ్సైట్ పేర్కొంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల సందర్శకులు మాస్క్ ధరించడం తప్పనిసరి. ఒకప్పుడు పాండాలు అంతరించిపోతున్నట్లు జాబితా చేయబడ్డాయి. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది. అడవిలో 1,800 జెయింట్ పాండాలు ఉన్నాయని అంచనా.

Also Read: Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )

Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ… వైరల్‏గా మారిన వీడియో…