AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్‌ వచ్చినా ప్రమాదమే!

క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్‌ వచ్చినా ప్రమాదమే!

Phani CH
|

Updated on: Jun 21, 2026 | 5:02 PM

Share

ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది యువకులు ప్రాణాలను పణంగా పెట్టి పెట్రోల్, డీజిల్‌ను అక్రమంగా తరలిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇరాన్‌లో తక్కువ ధరకు లభించే ఇంధనాన్ని పాకిస్తాన్‌లో విక్రయించి కుటుంబాలను పోషిస్తున్నారు. ఎడారి వేడి, ప్రమాదకర మార్గాలు, భద్రతా తనిఖీల మధ్య సాగుతున్న ఈ జీవన పోరాటం పేదరికం, నిరుద్యోగానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఎడారిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. వేడి గాలులు శరీరానికి మంట పుట్టిస్తున్నాయి. ఒకవైపు సాయుధ పోరాట ఘర్షణ, మరోవైపు భద్రతా బలగాల తనిఖీలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిరోజూ వందలాది బైకర్లు ఇరాన్-పాకిస్తాన్‌ సరిహద్దు మీదుగా పెట్రోల్, డీజిల్‌ను తరలిస్తూ జీవన పోరాటం చేస్తున్నారు. దీన్ని కేవలం అక్రమ రవాణాగా మాత్రమే చూడలేం. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాలను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కీలక కారణాలుగా చెప్పచ్చు. ఇరాన్-పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది యువకులు ప్రాణాలను పణంగా పెడుతూ పెట్రోల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇరాన్‌లో తక్కువ ధరకు లభించే ఇంధనాన్ని పాకిస్తాన్‌‌కు తరలిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. చట్టపరంగా ఇది అక్రమ రవాణా అయినప్పటికీ, స్థానికుల దృష్టిలో ఇది పొట్టకూటికి ఓ మార్గం. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌ ఇంకా ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతాల మధ్య 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం ఎడారులు, కొండలతో నిండి ఉంటుంది. వేలాది మంది స్థానికులు ఇంధనాన్ని రవాణా చేస్తూ దానిపైనే ఆధారపడుతున్నారు. ఇరాన్‌లో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా ఇంధన ధరలు తక్కువ. అదే ఇంధనాన్ని పాకిస్తాన్‌లో విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. ఈ ధరల వ్యత్యాసమే భారీ స్థాయిలో ఇంధన రవాణాకు కారణమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని డిపోల నుంచి పెట్రోల్, డీజిల్‌ను క్యాన్లలో నింపుకుని బైక్‌లకు కట్టుకొని ప్రయాణించడం అక్కడ సాధారణ దృశ్యంగా మారింది. ఒక్కో బైక్‌పై అనేక క్యాన్లలో వందల లీటర్ల ఇంధనాన్ని మోస్తారు. అయితే ఇంధనం బరువుతో బైక్ నియంత్రణ కోల్పోతే మాత్రం ప్రమాదం తప్పదు. చిన్న స్పార్క్ వచ్చినా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఈ ప్రమాదాలను లెక్కచేయకుండా యువకులు ఈ పని చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్

Follow Us