బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నాడు.. అర కిలోమీటరు వెళ్లగానే

Updated on: Oct 22, 2025 | 6:16 PM

పెట్రోల్ బంక్‌కి వెళ్లి ఇంధనం పోంచుకున్న వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బంక్ నుంచి పెట్రోల్‌కి బదులుగా నీళ్లు రావడంతో వాహనాలు కొంతదూరం వెళ్లగానే ఆగిపోయాయి. కాకినాడలోని భారత్ పెట్రోలియం బంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బంక్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంక్ వద్దే మూడుగంటలపాటు ఆందోళన కొనసాగింది.కేవలం కాకినాడలోనే కాదు, ఇటీవల తునిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి పెట్రోల్ బంక్‌లో కూడా పెట్రోల్‌తో పాటు నీళ్లు రావడంతో వాహనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే, వర్షం వల్ల ట్యాంక్‌లోకి నీళ్లు చేరాయి అని చెప్పి సదరు బంక్ నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంధన నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి బంక్‌లపై కంట్రోల్ లేనందుకు అధికారులపైనా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. నాణ్యత లేకపోవడం ప్రజలలో ఆవేదన కలిగిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే స్టేషన్లో ఏదైనా కొంటున్నారా ?? ఇలా కాలర్‌ పట్టుకుంటారు జాగ్రత్త

మోనాలిసా కొలువైన మ్యూజియంలో.. మహా దోపిడీ

మర్యాదగా ఒప్పుకో.. లేదంటే లేపేస్తాడు జెలెన్ స్కీ‌కి ట్రంప్ వార్నింగ్

ఆ చెట్టు ఆకుల్లో బంగారం.. నిర్ధారించిన ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు

నోరు మూయలేక ఇబ్బందిపడ్డ యువకుడు.. దేవుడిలా వచ్చి