Andhra: కేవలం రూ10కే ఫ్రై పీస్ బిర్యానీ.. కట్ చేస్తే ఇది సీన్
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వీరవల్లి టోల్ ప్లాజా వద్ద హోటల్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కేవలం పది రూపాయలకు విక్రయించడంతో బిర్యానీ కోసం హోటల్‌కు జనం పోటెత్తారు. వీడియో చూడండి ....
ఇప్పుడు బయట ఛాయ్ తాగాలంటేనే 10 రూపాయలు అవుతుంది. భోజనం చేయాలంటే 100 రూపాయలు. ఇక మంచి బిర్యానీ తినాలంటే 200 కావాల్సిందే. అలాంటి బిర్యానీ 10 రూపాయలకే ఇస్తామంటే.. నాన్ వెజ్ ప్రియులు ఆగుతారా చెప్పండి. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వీరవల్లి టోల్ ప్లాజా వద్ద హోటల్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కేవలం పది రూపాయలకు విక్రయించడంతో బిర్యానీ కోసం హోటల్ వద్దకు జనం పోటెత్తారు. వారిని అదుపు చేసేందుకు నిర్వాహకులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: May 02, 2025 01:26 PM