ప్రయాణికుల బంపర్ ఆఫర్.. గుంజీలు తీస్తే ఫ్రీగా బస్సు టిక్కెట్ !!
ప్రయాణికులను ఆకర్షించేందుకు రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గుంజీలు తీస్తే.. ప్రయాణ టికెట్ ఫ్రీగా ఇస్తామని తెలిపింది. చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీయాలని పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు.
ప్రయాణికులను ఆకర్షించేందుకు రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గుంజీలు తీస్తే.. ప్రయాణ టికెట్ ఫ్రీగా ఇస్తామని తెలిపింది. చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీయాలని పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు. అయితే ఇక్కడ మాత్రం ప్రజలు గుంజీలు తీసి.. ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందుతున్నారు. సుమారు 20 గుంజీలు తీస్తే.. ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. యూరప్‌లోని రొమానియా అనే నగరంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి మంచి ఆఫర్‌ని అందిస్తోంది. స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ని ప్రజలకు ఇస్తోంది రొమానియా సర్కార్. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉచిత టిక్కెట్‌ను అక్కడి ప్రజలు హెల్త్ టిక్కెట్‌గా పిలుస్తున్నారు. అంతేకాదండోయ్ కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీస్తేనే ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందగలుగుతారట. కాగా ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో… ఒక అమ్మాయి మిషన్ బూత్ ముందు నిలబడి 20 గంజీలు తీసింది. అయిపోగానే మిషన్ నుంచి ప్రయాణ టిక్కెట్ బయటకు వచ్చింది. ఫ్రీగా టికెట్‌తో పాటు ఆరోగ్యం పొందుతున్నందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: