వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..
ఏకధాటిగా వంద రోజుల పాటు నీటి అడుగున నివసించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా ప్రొఫెసర్ ఒకరు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన 76 రోజులుగా సముద్రపు నీటి అడుగున నిర్మించిన ఆవాసంలో ఉంటూ గత రికార్డులను బద్ధలుకొట్టారు. ఫ్లోరిడాలోని కీ లార్గోలో సముద్ర జలాల్లో 30 అడుగుల కింద..
ఏకధాటిగా వంద రోజుల పాటు నీటి అడుగున నివసించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా ప్రొఫెసర్ ఒకరు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన 76 రోజులుగా సముద్రపు నీటి అడుగున నిర్మించిన ఆవాసంలో ఉంటూ గత రికార్డులను బద్ధలుకొట్టారు. ఫ్లోరిడాలోని కీ లార్గోలో సముద్ర జలాల్లో 30 అడుగుల కింద స్కూబా డైవర్స్ కోసం నిర్మించిన ఆవాసంలోకి మార్చి 1న ప్రొఫెసర్ జోసెఫ్ డిటురి ప్రవేశించారు. గతంలో 2014లో ఇద్దరు ప్రొఫెసర్లు బ్రూస్ కాంట్రెల్, జెస్సికా ఫెయిన్.. ఇదే ప్రాంతంలో 73 రోజుల పాటు నీటిలో అడుగున జీవించి రికార్డు నెలకొల్పారు. అయితే, ప్రొఫెసర్ డిటురి 76 రోజులుగా నీటి అడుగున జీవిస్తూ వారి రికార్డును అధిగమించారు. అంతేకాకుండా 100 రోజులు పూర్తైన తర్వాతే జూన్ 9న బయటకు వస్తానని స్పష్టం చేస్తున్నారు. తన ఆవాసంపై పీడనాన్ని తగ్గించే సాంకేతిక ఏర్పాట్లేవీ లేకుండానే ఆయన అక్కడ కొనసాగుతున్నారు. విద్య, వైద్య, సముద్ర పరిశోధనల్లో భాగంగా నీటి అడుగున నివసించే వసతిని ‘మెరైన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: భర్త అంత్యక్రియలు ముగిశాక భార్య ఆత్మహత్య..
Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే నటి సమంతా కన్నుమూత
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి వచ్చేసింది.. ఇక ఎండలు లేనట్టే !!
Adipurush: క్రేజీ రికార్డ్ ఆదిపురుష్ నెవర్ బిఫోర్ ఫీట్ !!