Floods in Edupayalo video: మళ్ళీ మునిగిన ఏడుపాయల గుడి.. భారీ వర్షాలు ఎంత పని చేసాయి..(వీడియో)

|

Sep 28, 2021 | 9:58 AM

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం ముందు నీటి ఉధృతి అధికంగా ఉంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు ఆలయ అధికారులు. అమ్మవారి గర్భగుడిని తాకుతూ మంజీర నది ప్రవహిస్తున్నది. రాజగోపురంలోనే భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఎవరూ ఆలయంలోకి వెళ్లకుండా నది ప్రవాహం చుట్టూ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అర్చకులు రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అక్కడి నుంచే అమ్మవారిని దర్శించుకుని వెనుతిరుగుతున్నారు. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Running car fire Video: చూస్తూ చూస్తూనే ఘోర ప్రమాదం.. బంజారాహిల్స్‌లో రన్నింగ్‌ కారులో మంటలు..(వీడియో)

 Roja vs Chakrapanireddy Video: భగ్గుమన్న వర్గపోరు.. పీక్‌ స్టేజికి చేరిన రోజా వర్సెస్‌ చక్రపాణిరెడ్డి.. (వీడియో)

 Gulab Cyclone Live Video: గులాబ్‌తో ఉక్కిరి బిక్కిరి.. స్మార్ట్‌సిటీస్‌లో ఫ్లడ్‌ బెల్స్‌.. తుఫాన్ లైవ్ వీడియో..

 News Watch LIVE: అతలాకుతలం చేసిన కుంభవృష్టి| తెలంగాణను శపించొద్దు-కేటీఆర్ | అంతంత మాత్రంగా భారత్ బంద్..(వీడియో)

Published on: Sep 28, 2021 09:57 AM