ఐదు కాళ్లతో గొర్రెపిల్ల.. వరంగల్‌లో వింత !! ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు

|

Jul 19, 2023 | 9:20 PM

బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం అవుతుందా? ఒక్కొక్కటిగా ఊహాకందని వింతలు కళ్ళ ముందే జరుగుతాయని ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి ఓ వింత గొర్రె పిల్ల జన్మించిన ఘటన వరంగల్‌లోని గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన తిరుపతి

బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం అవుతుందా? ఒక్కొక్కటిగా ఊహాకందని వింతలు కళ్ళ ముందే జరుగుతాయని ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి ఓ వింత గొర్రె పిల్ల జన్మించిన ఘటన వరంగల్‌లోని గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన తిరుపతి యాదవ్ మేకలను గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. గొర్రెల మందలోని ఓ గొర్రె ఉదయం ఓ వింత గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. ఆ గొర్రెపిల్లకు ఐదు కాళ్లున్నాయి. తల్లి గొర్రె ఆరోగ్యంగానే ఉంది. గొర్రె పిల్లను చూసి ఆశ్చర్యపోయిన తిరుపతి యాదవ్‌ ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదని గ్రామస్థులతో అన్నాడు. విషయం తెలియడంతో గొర్రె పిల్లను చూడటానికి ప్రజలు బారులు తీరారు. వింతను ఆసక్తిగా చూస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రైల్వే స్టేషన్లు బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లు.. దట్టమైన అడవులు, కొండల మధ్య

కొంపముంచిన స్మార్ట్‌ ఫోన్‌.. గేమ్‌ ఆడుతూ మతి స్థిమితం కోల్పోయాడు..

పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!

TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్‌ బద్దలుకొట్టిన ఒక్కమగాడు

Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం