క్రిస్మస్‌ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత

Updated on: Dec 28, 2025 | 5:06 PM

అంతర్వేది మినీ హార్బర్‌లో క్రిస్మస్ రోజున మత్స్యకారులకు అరుదైన శిలువ పీత దొరికింది. దాని డొప్పపై శిలువ ఆకారం ఉండటంతో దాన్ని దైవంగా భావించారు. క్రైస్తవులు పవిత్రంగా చూసే క్రిస్మస్ రోజు దొరకడంతో, అదృష్టంగా భావించి పీతను తిరిగి సముద్రంలో వదిలేశారు. ఈ పీతలను సాధారణంగా తినరు, మత్స్యకారులకు ఇది శుభసూచకం.

సముద్రంలో రకరకాల చేపలు జీవిస్తాయి. ఇటీవల భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొస్తున్న ఘటనలు మనం చూసాం. తాజాగా అంతర్వేది మినీ హార్బర్‌లో విచిత్రమైన పీత ఒకటి మత్స్యకారులకు దొరికింది. క్రిస్మస్‌ వేళ దొరికిన ఆ పీతను దైవసమానంగా భావించి దానిని తిరిగి సముద్రంలో వదిలేసారు మత్స్యకారులు. పీత దైవ సమానమేంటి అనుకుటున్నారా.. నిజమే.. అది శిలువ పీత. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్లో ఈ అరుదైన సిలువ పీత మత్స్యకారుల వలకు చిక్కింది. సాధారణంగా వేలల్లో పీతలను వేటాడినప్పుడు చాలా అరుదుగా ఈ సిలువ పీతలు ఒకటో రెండో పడతాయి. ఈ పీతకు ఆ పేరు ఎందుకొచ్చిందంటే.. ఆ పీత డొప్పమీద శిలువ ఆకారం ఉంటుంది. అందుకే దానిని శిలువ పీత అంటారు. అందులోనూ క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్‌ రోజున సిలువ పీత దొరకడంతో దానిని దైవంగా భావించి మత్స్యకారులు నదిలో వదిలిపెట్టారు. దైవంగా భావించే ఈ పీతలను తినడానికి ఎవరూ ఆసక్తి చూపరని మత్స్యకారులు అంటున్నారు. క్రిస్మస్‌ వేళ ఇలా సిలువ పీత దొరకడం తమ అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gmail: గుడ్‌ న్యూస్‌.. మీ మెయిల్‌ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా

తొలి విడత జనగణనకు సర్వం సిద్ధం.. ముందుగా లెక్కించేది వాటినే

Srisailam: శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్

Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌