Telangana: చేపల ఫ్రై చేస్తుండగా అనూహ్య ఘటన.. కస్టమర్లు పరుగో పరుగు..!

| Edited By: Basha Shek

May 18, 2024 | 11:33 PM

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు స్టేజి దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఓ పూరి గుడిసె దగ్దమైంది. గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన మారెప్ప పెంచికలపాడు గ్రామా స్టేజ్ వద్ద పూరి గుడిసె నిర్మించుకొని చేపల ప్రై చేసి వినియోగదారులకు విక్రయించేవాడు. శనివారం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి.

తెలంగాణలోని..  జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు స్టేజి దగ్గర ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఓ పూరి గుడిసె దగ్దమైంది. గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన మారెప్ప పెంచికలపాడు గ్రామా స్టేజ్ వద్ద పూరి గుడిసె నిర్మించుకొని చేపల ప్రై చేసి వినియోగదారులకు విక్రయించేవాడు. శనివారం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి అహుతైంది. ఈ ఘటనలో వంటసామాగ్రి, ప్రిజ్, ఇతర వస్తువులు కాలిపోయాయి. సుమారు లక్షా 50 వేల ఆస్తి నష్టం వాటిలిందని, తమవి రెక్కాడితే కానీ డొక్కడని జీవితాలు అని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

 

 

 

 

Published on: May 18, 2024 07:26 PM