ప్లాస్టిక్ కుర్చిలో ఇరుక్కున్న లేగ దూడ తల.. చుక్కలు చూసింది !!
ఇటీవల ఇనుప ఊచల్లో, బిందెల్లో తల ఇరక్కుపోయి అవస్థలు పడ్డ జంతువుల గురించి విన్నాం.. ఈ క్రమలోనే తాజాగా ఓ లేగ దూడ ప్లాస్టిట్ కుర్చీలో తల దూర్చి తెగ ఇబ్బందులు పడింది.
ఇటీవల ఇనుప ఊచల్లో, బిందెల్లో తల ఇరక్కుపోయి అవస్థలు పడ్డ జంతువుల గురించి విన్నాం.. ఈ క్రమలోనే తాజాగా ఓ లేగ దూడ ప్లాస్టిట్ కుర్చీలో తల దూర్చి తెగ ఇబ్బందులు పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. ఆవుల మంద మేత మేసుకుంటూ రోడ్డు వెంబడి వెళ్తోంది. ఇంతలో ఓ హోటల్ వద్ద ప్లాస్టిక్ కుర్చీలో లేగదూడ తల ఇరుక్కుపోయింది. తల బయటకు రాక దాదాపు రెండు గంటల పాటు ఇబ్బంది పడింది. సరిగ్గా దారి కనిపించకుండా అటు ఇటు తిరుగుతూ అవస్థలు పడింది. ఇది గమనించిన స్థానిక యువకులు కుర్చీని తీసేందుకు ప్రయత్నించినా చేతికి దొరకలేదు. ఎట్టకేలకు యువకులు తలకు ఇరుక్కున్న కుర్చీని తీసేశారు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ ఆ లేగదూడ పరుగులు తీసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Dec 01, 2022 09:10 AM