రూ.4.3 కోట్ల కారు కొని… ఇంట్లో వేలాడదీశాడు

Updated on: Jul 25, 2025 | 1:11 PM

రోజువారీ అవసరాల నిమిత్తం కారు కొనేవారిని మీరు చూసుంటారు. మోజుపడి అప్పోసొప్పో చేసి కారు కొనేవారినీ మీరు చూసే ఉంటారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొని ఇంట్లో డెకరేషన్ కోసం వాడిన వాడి గురించి మీరు విని ఉండరు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దుబాయ్‌కు చెందిన యూట్యూబర్ తన ఇంటి పైకప్పుకి షాండ్లియర్‌గా వేలాడదీయడానికి రూ. 4.3 కోట్ల విలువైన ఫెరారీని కొనుగోలు చేసి ఇంట్లో డెకరేషన్‌ వస్తువులాగా వాడేశాడు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. ఆన్‌లైన్‌లో MoVlogs అని పిలువబడే మొహమ్మద్ బీరాగ్దరీ UAEలో ఉంటున్నాడు. లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంబంధించి వీడియోలు చేస్తున్న ఇరానియన్ వ్లాగర్‌గా అతడికి మంచి గుర్తింపు ఉంది. 18.9 మిలియన్ వ్యూస్ వచ్చిన తన వీడియోలో అతడు ఇంటిలో అలంకరణకు వాడిన తన ఫెరారీ కారును నెటిజన్లను చూపించాడు. ఇంటిలో కాంతినిచ్చే షాండిలియర్ మాదిరిగా ఫెరారీ కారును వేలాడదీయటం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఇది రూ.4.3 కోట్ల విలువైన షాండిలియర్. ఇది నా ఆవిష్కరణ’అని ఆ వీడియోలో అతడు తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. అయితే, ఇది అసలు ఫెరారీ కారు కాదని, జెట్ కారు అని, దానిని లగ్జరీ స్పోర్ట్స్ కారులా డిజైన్ చేయించానని చెప్పాడు. ఈ వీడియోలో 10 మంది వ్యక్తులు ఆ ఎర్రని ఫెరారీ కారులో కూర్చొన్న తర్వాత.. అది పై కప్పుకు వేలాడతీస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..

అందం, ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్స్.. తప్పకుండా తీసుకోండి.. సరదాగా..

జీతమంతా ఈఎంఐలకే పోతోందా? మీ పరిస్థితీ ఇదేనా?

నిద్ర లేవగానే ఇలా చేస్తే.. మీ జీవితం అల్లకల్లోలమే

ఇంటి కప్పులో శబ్దాలు.. ఏంటని చూసిన ఓనర్ షాక్‌