Old Man Donated property: రూ.2 కోట్ల ఆస్తి జిల్లా కలెక్టర్‌కి రాసేసిన తండ్రి... కొడుకు షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Old Man Donated property: రూ.2 కోట్ల ఆస్తి జిల్లా కలెక్టర్‌కి రాసేసిన తండ్రి… కొడుకు షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 17, 2021 | 9:33 AM

కన్నబిడ్డలను తల్లిదండ్రులు కంటికి రెప్పాలా కాపాడుతూ పెంచి ప్రయోజకులను చేస్తారు. తమ బిడ్డలే తమ సర్వస్వం అనుకుని జీవిస్తారు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటారని భావిస్తారు. కానీ ఇక్కడ ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలైపోయాయి.


కన్నబిడ్డలను తల్లిదండ్రులు కంటికి రెప్పాలా కాపాడుతూ పెంచి ప్రయోజకులను చేస్తారు. తమ బిడ్డలే తమ సర్వస్వం అనుకుని జీవిస్తారు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటారని భావిస్తారు. కానీ ఇక్కడ ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలైపోయాయి. కన్నబిడ్డలు కనీసం తిండికూడా పెట్టకపోవడంతో ఆ పెద్దాయన మనసు విరిగిపోయింది. దాంతో అతని ఆస్తి పాస్తులను ప్రభుత్వానికి ధారదత్తం చేశాడు. తన పేరున ఉన్న 2 కోట్ల విలువైన ఆస్తిని జిల్లా కలెక్టర్ పేరున వీలునామా రాశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన వీలునామా పత్రాలను అందజేయడంతో అక్కడ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.ఆగ్రాలోని నీరాలబాద్‌ పీపల్‌‌మండి నిరాలాబాద్ ప్రాంతానికి చెందిన గణేశ్‌ శంకర్‌ పాండే అనే 88 ఏళ్ల వ్యక్తికి 225 చదరపు గజాల స్థలం ఉంది. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకునే ఇతనికి ఇద్దరు కుమారులు. పాండే తన పెద్ద కుమారుడు వద్ద ఉంటున్నారు. అయితే తండ్రి తన వద్ద ఉంటున్నందుకుగాను పెద్ద కుమారుడు ఆస్థిలో ఎక్కువ భాగం తనకు ఇవ్వాలని తరుచూ గొడవకు దిగేవాడు. అది కరెక్ట్‌ కాదని కుమారుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతను వినిపించుకోలేదు. దాంతో పాండేకు చెందిన భూమిని ఆగ్రా కలెక్టర్‌ పేరు మీద వీలునామా రాశారు. ఈ పత్రాలను కలెక్టర్‌కు అప్పగించేందుకు వచ్చిన ఆయన.. కుటుంబసభ్యులు తనను ఇంటి నుంచి తరిమేశారని గణేశ్‌ శంకర్‌ తెలిపారు. దీంతో తన ఆస్తిని.. కలెక్టర్‌ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఆగ్రా కలెక్టర్ ఏకే సింగ్ నవబంరు 25 నాడు పీపల్ మండి నిరాలాబాద్‌కు చెందిన ఓ పెద్దాయన వచ్చి తనకు ఆస్తి పత్రాలను అందజేశారన్నారు. పెద్ద కుమారుడి తీరుతో కలత చెందడంతో తన ఆస్తిని ఇలా కలెక్టర్ పేరుతో రాసినట్టు చెప్పారన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను కూడా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

Published on: Dec 17, 2021 09:32 AM