చనిపోయిందనుకున్న కుమార్తె.. రెండు నెలల తర్వాత.. ట్విస్ట్ సూపర్

Updated on: Dec 11, 2025 | 4:38 PM

కన్నబిడ్డను తండ్రి కాల్వలో పడేయగా, రెండు నెలల తర్వాత ఆమె తిరిగివచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రాణాలతో బయటపడిన బాలిక పోలీసులను తండ్రిని విడుదల చేయాలని కోరింది. తల్లి రెచ్చగొట్టడం వల్లే తండ్రి అలా చేశాడని, చెల్లెళ్లకు తండ్రి అవసరమని కన్నీళ్లతో ప్రాధేయపడింది. దీంతో తండ్రిపై హత్య కేసును హత్యాయత్నంగా మార్చే ఆలోచనలో పోలీసులున్నారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డను కాల్వలో పడేసాడు. అయితే అనూహ్యంగా ఆ కుమార్తె రెండు నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. హత్యా నేరం కింద జైల్లో ఉన్న తండ్రిని విడిచి పెట్టాలని పోలీసులను ప్రాధేయపడింది. ఈ ఘటన ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. 17 ఏళ్ల బాలిక చదువు మానేసి ఖాళీగా ఉండటంతో ఆమెపై ఆనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు తండ్రి. సెప్టెంబర్ 29న రాత్రి వేళ కూతురు విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సుర్జిత్ సింగ్‌ పెద్ద కుమార్తె చేతులను తాడుతో కట్టేశాడు. భార్య, మరో ముగ్గురు కుమార్తెలు చూస్తుండగానే ఆమెను కాలువలోకి తోసేశాడు. షాక్‌ అయిన తల్లి సహాయం కోసం కేకలు వేసింది. అయితే నీటిలో కొట్టుకుపోతున్న కుమార్తెకు తండ్రి బై బై చెప్తూ వీడియో కూడా తీసాడు. అతడు రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నీటిలో కొట్టుకుపోయిన ఆ బాలిక చనిపోయినట్లు ఆమె కుటుంబం, పోలీసులు భావించారు. బంధువుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన సుర్జిత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే రెండు నెలల తర్వాత డిసెంబర్‌ 7న ఆ బాలిక తిరిగి వచ్చింది. అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో ఎలా బయటపడిందో మీడియాకు వివరించింది. అనారోగ్యం పాలైన తాను ఒకచోట చికిత్స పొందినట్లు తెలిపింది. తలకు గాయం వల్ల కొన్ని విషయాలు గుర్తు లేకపోవడంతో వెంటనే తిరిగి రాలేకపోయినట్లు చెప్పింది. అయితే ఈ రెండు నెలలు ఎక్కడ ఉన్నదీ ఆమె వెల్లడించలేదు. కాగా, అరెస్ట్‌ చేసిన తన తండ్రి సుర్జిత్ సింగ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని పోలీస్‌ అధికారులను ఆ యువతి కోరింది. తన ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత చూసేవారు ఎవరూ లేరని, వారికి తండ్రి అవసరమంటూ కన్నీళ్లతో ప్రాథేయపడింది. తల్లి తన గురించి చెడుగా చెప్పి రెచ్చగొట్టడంతోనే మద్యం మత్తులో ఉన్న తండ్రి అలా చేశాడని తెలిపింది. బంధువులపై నమ్మకం లేదన్న ఆ బాలిక తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అయితే ఆ బాలిక తిరిగి రావడంతో ఆమె తండ్రిపై నమోదు చేసిన హత్య కేసును హత్యాయత్నంగా మార్పు చేస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు. బాలిక స్టేట్‌మెంట్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్‌ షాక్

ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ

షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్‌ !! ఇక వీరికి దబిడి దిబిడే

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!