కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

Updated on: Dec 04, 2025 | 8:24 PM

క్యూటీ మెందిరత్తా అనే 21 ఏళ్ల యువతికి రెండు కిడ్నీలు పాడవ్వగా, తండ్రి యోగేశ్ తన కిడ్నీని దానం చేసి ప్రాణం పోశారు. ఇది తండ్రి ప్రేమకు నిదర్శనం. ఈ సంఘటన కిడ్నీల ఆరోగ్యం, వాటి సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తుంది. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ఎంత ముఖ్యమో వైద్యులు సూచిస్తున్నారు.

21 ఏళ్ల చిన్న వయసులో ఉన్న కుమార్తె ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. తండ్రి తన బిడ్డను అలా చూస్తూ ఉండలేక కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసారు. చివరికి తన కిడ్నీ సైతం ఇచ్చారు. ఢిల్లీకి చెందిన క్యూటీ మెందిరత్తా కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడింది. కిడ్నీ మార్పిడి చేసుకుంటే ప్రాణాపాయం ఉండదని వైద్యులు సూచించారు. రెండు కిడ్నీలు పాడై ప్రాణాంతక స్టేజ్‌కి చేరుకున్న ఆ యువతికి కన్న తండ్రి దేవుడిలా ఆదుకున్నారు. క్యూటీ మెందిరత్తాకి ఆమె తండ్రి యోగేశ్‌ మెందిరత్తా కిడ్నీ ఇచ్చి వార్తల్లో నిలిచారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ క్యూటీకి ముందుగా మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌తో మొదలైన సమస్య.. నెమ్మదిగా రెండు కిడ్నీలు పాడయ్యేలా వ్యాపించింది. దీంతో కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. దాంతో ఆమె తండ్రి ముందుకొచ్చారు. నెల క్రితమే క్యూటీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరగ్గా.. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. క్యూటీకి సోషల్‌ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. క్యూటీకి ఆమె తండ్రి తిరిగి ప్రాణం పోశారు. రెండు మూత్రపిండాలు పాడైన ఆమెకు.. తన కిడ్నీ దానం చేసి రెండో జన్మ ప్రసాదించారు. ప్రతి ఒక్కరికి కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన అవసరం అంటున్నారు వైద్యులు. మధుమేహం, బీపీలాంటి రోగాలు లేకున్నా సీకేడీ కేసులు బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు. ఒడిశా, పుదుచ్చేరి, ఏపీలోని ఉద్దానం ప్రాంతాల్లో యువతలో కిడ్నీ జబ్బులు బయటపడుతున్నాయి. చాలామందిలో వ్యాధి ముదిరే వరకు లక్షణాలు బయటపడవు. ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేకున్నా ఏడాదికి ఒకసారి కిడ్నీలను పరీక్షించుకోవాలి. బీపీ, మధుమేహం నియంత్రణలో పెట్టుకోవడమే కాకుండా ధూమపానం, మద్యపానం ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. రోజూ తగిన వ్యాయామం, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని బట్టి వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా పెయిన్​ కిల్లర్లు, యాంటాసిడ్ మందులు కొనుక్కొని వాడవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. బిడ్డను చూడడానికి వెళ్లిన తండ్రిని ఏం చేశారంటే..

Hardik Pandya: సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ ??

Elon Musk: ఎలన్ మస్క్‌ కుమారుడి పేరు శేఖర్

ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

ఇది ఆటోనా.. అంబులెన్సా.. అర్ధరాత్రి వేళ..