Viral Video: పిల్లలకు వింత పేర్లు పెట్టిన తండ్రి.. పేర్లు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో

|

Sep 02, 2021 | 8:49 AM

జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం భారతీయ సాంప్రదాయం. జనన సమయంలో ఏ నక్షత్రం వుందో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారుల పేర్లను నిర్ణయించడం శుభప్రదంగా భావిస్తారు.

జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం భారతీయ సాంప్రదాయం. జనన సమయంలో ఏ నక్షత్రం వుందో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారుల పేర్లను నిర్ణయించడం శుభప్రదంగా భావిస్తారు. అలాకాక కొంత మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు దేవుని పేర్లు లేదా తాత, ముత్తాల పేర్లు పెట్టుకుంటారు. లేదా తమకు నచ్చిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లతో పిలుచుకుంటారు. అయితే చిత్తూరు జిల్లా, జీడీ నెల్లూరు మండలం, మాంబేడు గ్రామానికి చెందిన ఓ రైతు తన ఐదు మంది పిల్లలకు అభివృద్ధి చెందిన దేశాల పేర్లు పెట్టి మురిసిపోతున్నాడు. గంగాధర నెల్లూరు మండలం, మాంబేడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. హిస్టరీ సబ్జెక్ట్ ను అమితంగా ప్రేమించేవాడు చంద్రశేఖర్ రెడ్డి.. తనకున్న కాస్తంత భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Keerthi Suresh: మరో ఛాలెజింగ్‌ పాత్రలో మహానటి.. పెళ్లి కాకుండానే తల్లి క్యారెక్టర్‌లో నటిస్తున్న కీర్తి.. వీడియో

అంతరిక్షంలో నోరూరించే పిజ్జా.. సోషల్‌ మీడియా వేదికగా వీడియో వైరల్