లేగ దూడకు శాస్త్రోక్తంగా నామకరణం.. ఇంతకీ ఏం పేరు పెట్టారో తెలుసా వీడియో

Edited By:

Updated on: Jan 04, 2026 | 10:55 AM

చంటి పిల్లలకు నామకరణం చేయడం.. నామకరణం సందర్భంగా ఇంట్లో వేడుక నిర్వహించడం.. లేదంటే ఆలయాలలో వేడుక నిర్వహించడం కామన్ గా చూస్తుంటాం.. కానీ వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో రైతు కుటుంబం తన ఇంట్లో గోవు జన్మనిచ్చిన లేగ దూడకు నామకరణం సందర్భంగా వేడుక నిర్వహించి ఊరంతా ఆశ్చర్యపరిచారు.. ఆ లేగ దూడకు "నందీశ్వర' అని నామకరణం చేసి మురిసిపోయారు..

లేగ దూడకు శాస్త్రోక్తంగా నామకరణం చేసిన ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లి గ్రామంలో జరిగింది. విజయ సురేందర్ దంపతులు కొన్నేళ్ల క్రితం ఒక ఆవును కొని తెచ్చుకున్నారు.ఆవును అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.ఆ ఆవుకు కొద్ది రోజుల క్రితం శ్రీమంతం కూడా చేశారు. తర్వాత వారం రోజుల క్రితం ఆవు ఒక లేగ దూడకు జన్మనిచ్చింది.అయితే బంధుమిత్రులనుతన ఇంటికి ఆహ్వానించిన రైతు కుటుంబం శాస్త్రోక్తంగా లేగ దూడకు నామకరణం వేడుక నిర్వహించారు. వేద పండితులను పిలిపించి శుభకార్యం జరిపారు. ఆ లేగ దూడకు “నందీశ్వర” అనే నామకరణం చేశారు.ఎక్కడా కనివిని ఎరుగని విధంగా లేగ దూడకు నామకరణం వేడుక నిర్వహించి ఊరందరిని ఆహ్వానించడం ఇక్కడ తీవ్ర చర్చగా మారింది. ఆ మూగజీవిపై సురేందర్ దంపతులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు.గోమాతకు పూజలు నిర్వహించి మన ఇంటి దైవంలా ఆరాధిస్తే సర్వం శుభం కలుగుతుందని విజయ సురేందర్ దంపతులు తెలిపారు. లేగ దూడకు నామకరణం వేడుక ఇలా నిర్వహించడం ఊరంతా చర్చగా మారింది.

Published on: Jan 04, 2026 10:53 AM