Hyderabad: చలికి వణుకుతున్న భాగ్యనగరం.! పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు..

|

Dec 23, 2023 | 8:08 AM

ఇటు హైదరాబాద్ ను కూడా చలి వణికిస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటి పూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకింగ్‌కు వెళ్లేందుకు బయట అడుగుపెట్టాలంటే నగరవాసులు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని...

రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. గడ్డకట్టే చలితో రాష్ట్రంలో గజ గజ వణుకుతోంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో అన్ని ప్రాంతాల్లో శీతల వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ సహా పలు జిల్లాలు చలితో గజగజలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్ ను కూడా చలి వణికిస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటి పూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకింగ్‌కు వెళ్లేందుకు బయట అడుగుపెట్టాలంటే నగరవాసులు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. సోమవారం అత్యల్పంగా పటాన్‌చెరు, రామచంద్రాపురంలో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.