Phone Blast: పరీక్షకు వెళ్లే విద్యార్థి జేబులో ఫోన్.. జేబులోనే పేలింది..!

Updated on: Jul 14, 2023 | 9:24 PM

నెల్లూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయిప్రదీప్ శుక్రవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ కాలేజీలో

నెల్లూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయిప్రదీప్ శుక్రవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్కూటీపై బయలుదేరాడు. మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారి పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ బల్లను ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రముఖ బ్రాండ్‌ ఫోన్‌ను తాను ఇటీవలే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్టు సాయి తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...