అందరూ గుడిలోకి వెళ్తుంటే..వీళ్లు మాత్రం గుడివెనక్కి వెళ్లారు..ఎందుకంటే ??

|

Feb 05, 2024 | 1:09 PM

అందరూ గుడిలో దేవుడి దర్శనానికి వెళ్తుంటే.... మరి వాళ్లేమో గుడి వెనకకు గడ్డపారలు తీసుకుని వెళ్లారు. అక్కడ గుప్త నిధులు ఉన్నాయని భావించి ఓ ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం వేట మొదలుపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా ఆలయాల వెనుక తవ్వకాలు చేస్తున్న వీరిని పసిగట్టి కటకటాల్లోకి పంపాపు పోలీసులు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. చింతకాయల శివ గంగరాజు తన సమీప బంధువులైన మరో ఎనిమిది మందితో గుప్త నిధుల కోసం గుడి దగ్గర తవ్వకాలు మొదలుపెట్టాడు.

అందరూ గుడిలో దేవుడి దర్శనానికి వెళ్తుంటే…. మరి వాళ్లేమో గుడి వెనకకు గడ్డపారలు తీసుకుని వెళ్లారు. అక్కడ గుప్త నిధులు ఉన్నాయని భావించి ఓ ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం వేట మొదలుపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా ఆలయాల వెనుక తవ్వకాలు చేస్తున్న వీరిని పసిగట్టి కటకటాల్లోకి పంపాపు పోలీసులు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. చింతకాయల శివ గంగరాజు తన సమీప బంధువులైన మరో ఎనిమిది మందితో గుప్త నిధుల కోసం గుడి దగ్గర తవ్వకాలు మొదలుపెట్టాడు. దాదాపు 8 అడుగుల లోతు భారీ గుంత తవ్విన గుప్త నిధుల ముఠాకు నిధులు కనిపించలేదు గాని గుంతలో నుంచి తల పైకెత్తి చూసేసరికి పోలీసులు కనిపించారు. పలుగు, పారలతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా శబ్దాలు విన్న స్థానికులు… పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పక్కా ప్రణాళికతో తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yashasvi Jaiswal: వీధుల్లో చిరుతిళ్లు అమ్మిన యశస్వీ .. స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడు ??

కలిసి చనిపోదామని రైల్వే ట్రాక్ వద్దకు జంట.. ప్రియుడి ఆత్మహత్య.. ప్రియురాలి ట్విస్ట్‌

ఆలయ అభివృద్ధికి యాచకుడి విరాళం.. ఎంతో తెలుసా ??

 

Follow us on