ఇది ఎలిఫెంట్ చెక్‌పోస్ట్.. ఆపి తీరాల్సిందే !!
సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా ఉంటుంది. ఆ ప్లాజాల్లో టోల్ ఛార్జీ వసూలు చేస్తుంటారు. మరి అడవిలో టోల్‌ప్లాజా గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది వెరీ స్పెషల్..
సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా ఉంటుంది. ఆ ప్లాజాల్లో టోల్ ఛార్జీ వసూలు చేస్తుంటారు. మరి అడవిలో టోల్‌ప్లాజా గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది వెరీ స్పెషల్.. ఇక్కడ జంతువులే టోల్ వసూలు చేస్తుంటాయి. అవును అదెలా? అనుకుంటున్నారా.. లుక్ ఇన్ టు దిస్ స్టోరీ.. అడవి ప్రాంతం గుండా చెరుకు లోడుతో రెండు వాహనాలు వెళ్తున్నాయి. ఈ విషయం అక్కడున్న గజరాజుకు తెలుసు… ఈ వాహనాలను గమనించిన ఏనుగు ఆ వాహనాన్ని ఆపమన్నట్టు తన తొండం పైకెత్తింది. వెంటనే డ్రైవర్ ట్రక్కును ఆపేశాడు. అంతే ఏనుగు అలా ముందుకెళ్లి లారీలో ఉన్న చెరుకు గడలను కొన్ని తీసుకుని, ఇక నువ్వెళ్లొచ్చు అన్నట్టు ఆ చెరుకు గడలు తినడం మొదలుపెట్టింది. ఆ వెహికల్ ముందుకెళ్లిపోయింది. దాని వెనుక మరో వెహికల్ వచ్చింది. సేమ్ సీన్ రిపీట్.. అందులోనుంచి కూడా కొన్ని చెరుకు గడలను తీసుకుంది. ఆ తరువాత ఇక వెళ్లొచ్చు అంటూ ఆ వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు