Elephant Funny Video: ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌లో జంతువుల ఫన్నీ, అద్భుతమైన వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీన్ని చూస్తే మీ ముఖంలో చిరునవ్వు చిందడం ఖాయం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏనుగుతో ఫోటో దిగుతున్నప్పుడు అదృశ్యమైన ఒక మహిళ టోపీని.. ఏనుగు తిన్నట్లుగా ఈ వీడియోలో చూడొచ్చు. కానీ, ఆ తర్వాత ఏమి జరిగిందో చూస్తే, మీరందరూ ఆ ఏనుగుకు అభిమానులుగా మారిపోతారు.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ ఏనుగు ముందు పోజులివ్వడం చూడొచ్చు. ఏనుగు ఆమె వెనుక నుంచి వచ్చి తన తొండంతో టోపీని తీసుకుని తింటున్నట్లు నటించింది. ఆ మహిళ ఆశ్చర్యపోయి, ఆ టోపీని తన సోదరి తనకు బహుమతిగా ఇచ్చిందని ఏనుగుతో చెప్పింది. ఆ తరువాత ఏనుగును తిరిగి పొందగలనా అని ఆమె అడిగింది. ఆశ్చర్యకరంగా, ఏనుగు తన నోటి నుంచి టోపీని తీసి వెంటనే ఆ మహిళకు తిరిగి ఇవ్వడం చూడొచ్చు.
వీడియోతో పాటుగా “ఈ ఏనుగు మహిళ టోపీని తిన్నట్లు నటించి, ఆ తరువాత దానిని తిరిగి ఇస్తుంది” అని క్యాఫ్షన్ ఇస్టూ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 16 లక్షల సార్లు వీక్షించారు. ఏనుగు చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ‘జంతువులకు కూడా అద్భుతమైన హాస్యం ఉంటుంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
This elephant pretends to eat a woman’s hat… but then gives it back ??
pic.twitter.com/OV0ZN8wC0F— Funny Supply (@FunnySupply) December 13, 2021
Also Read: Viral Video: వారెవ్వా.. ఈ శునకం తెలివితేటలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే..!
Viral News: సలామ్ రైతన్న.. చేతులు వాడకుండానే పేడను ఎత్తాడు.. ఏం టెక్నాలజీ గురూ..!