కరెంట్ రీడింగ్ తీయబోతే.. కాటేయటానికి వచ్చిన పాము తర్వాత వీడియో
రుతుపవనాల తిరోగమనం, భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా మూలకలపల్లిలో ఓ ఇంటి కరెంట్ మీటర్‌లో చేరిన పాము, రీడింగ్ తీయడానికి వచ్చిన విద్యుత్ అధికారి రంగారావుపై దాడికి ప్రయత్నించింది. తృటిలో అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తిరోగమిస్తున్న సమయంలో కురుస్తున్న భారీ వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పొలాలు, తోటలు నీట మునిగిపోవడంతో పాములు తమ సహజ ఆవాసాలను కోల్పోయి జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఇళ్లలో ఫ్రిజ్‌లు, బీరువాలు, ఏసీలతో పాటు అనువైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి కరెంట్ మీటర్ బాక్స్‌లో పాము చేరింది. విషయం తెలియని విద్యుత్ అధికారి రంగారావు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీయడానికి ప్రయత్నించారు. ఇంతలో మీటర్ బాక్స్ లోపలి నుంచి ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
