షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని.. కారణం ఇదే..
ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు కొనేటప్పుడు వాటి సర్వీస్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సంస్థ సర్వీసు ఎలా ఉంటుంది? వారంటీ ఎన్నాళ్లు, ఆ వారంటీ టైంలో వారి సేవలు ఎలా ఉంటాయి... ఇలా అనేక రకాలుగా ఆలోచించి వస్తువులు కొంటుంటాం. తీరా వస్తువు కొన్న తర్వాత ఏదైనా సమస్య వచ్చి సదరు సంస్థకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది.
కోపం వస్తుంది కదా.. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న వ్యక్తికి సంస్థ సర్వీస్ బాలేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంతే స్కూటర్ తీసుకెళ్లి షోరూమ్ ముందే తగలబెట్టేసాడు. గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాలన్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని కొన్నాడు. తన భార్య, కుమారుడితో కలిసి షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో స్కూటీ స్టీరింగ్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. ఈ ఘటనలో వారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అతను, తన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి పంపించేశాడు. అనంతరం, విరిగిపోయిన స్కూటీని నేరుగా షోరూంకు తీసుకెళ్లి సమస్యను వివరించాడు. కంపెనీ ప్రతినిధుల నుంచి అతనికి సరైన సమాధానం గానీ, భరోసా గానీ లభించలేదని తెలుస్తోంది. కంపెనీ తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ వ్యక్తి, షోరూం ఎదుటే స్కూటీకి నిప్పంటించాడు. మంటలు వేగంగా వ్యాపించి వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. ఈ అనూహ్య ఘటనతో షోరూం సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: బంగారంతో చేసిన అదిరేటి డ్రెస్ ధరించిన యువతి.. ధర తెలిస్తే దడే
Madhya Pradesh: ఓరి బుడ్డోడా.. లక్ అంటే నీదే.. రూ.200లతో 53 లక్షలు కొట్టేశావ్
SSMB29: నాటు నాటు’ను మించేలా.. మహేశ్- ప్రియాంక చోప్రాపై ఫోక్ సాంగ్
డ్యామ్ గేట్లు తెరవటంతో.. ప్రాణాలు తీసిన పిక్నిక్..
పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. పెద్దలు చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్
