Watch: ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
ఉత్తరాదిలో దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. దసరా అంటే అక్కడ గుర్తుకొచ్చేది గర్భా నృత్యం. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అలాంటి సంప్రదాయ నృత్యాన్ని వృద్ధ జంట ఎంతో ఉత్సాహంగా చేసారు. వారి ఉత్సాహాన్ని చూసి స్థానికులే కాదు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు.
ఉత్తరాదిలో దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. దసరా అంటే అక్కడ గుర్తుకొచ్చేది గర్భా నృత్యం. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అలాంటి సంప్రదాయ నృత్యాన్ని వృద్ధ జంట ఎంతో ఉత్సాహంగా చేసారు. వారి ఉత్సాహాన్ని చూసి స్థానికులే కాదు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. ఏజ్ కేవలం నెంబర్ మాత్రమే అనుకున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో దసరా సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో ఓ వృద్ధ జంట సంప్రదాయ దుస్తులు ధరించి యువతకు సవాలు విసురుతున్నట్టుగా నృత్యం చేశారు. ఎంతో లయబద్ధంగా వారు చేస్తున్న నృత్యం చూసి అంతా ముగ్దులయ్యారు. వారి నృత్యాన్ని చూసి తనకూ కాలు కదపాలనిపించిందో ఏమో మరో వ్యక్తి కూడా వచ్చి వారితో జతకలిశాడు. ఆ వృద్ధుడితో కలిసి గర్బా డాన్స్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తనీష్ షా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 10 మిలియన్లమందికి పైగా వీక్షించారు. రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆ జంట మన కంటే చాలా యంగ్ మరియు ఎనర్జిటిక్‌గా ఉన్నారని కొందరు, ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని ఇంకొందరు కామెంట్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.