Banana: అరటిపళ్లను ఇలా మగ్గిస్తే.. ఆ టేస్టే వేరబ్బా

|

May 17, 2024 | 11:51 AM

ప్రస్తుత కాలంలో సహజంగా పండించిన పళ్లు దొరకడం చాలా అరుదైపోయింది. అన్నీ రసాయనాలతో పండించేవే. అరటిపండునుంచి మామిడి పండ్ల వరకూ అన్నీ రసాయనాలతోనే ముగ్గబెడుతున్నారు. దీంతో రుచి కాదుకదా.. పళ్లనుంచి లభించే సహజ పోషకాలు కూడా కోల్పోతున్నాయి. దీంతో అవి తిన్నా అంత ఉపయోగకరంగా ఉండటంలేదని చెప్పవచ్చు. అరటి పళ్లను సామాన్యుడి యాపిల్ గా చెబుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో సరైన అరటిపండ్లను కొనడం ఓ సవాలే.

ప్రస్తుత కాలంలో సహజంగా పండించిన పళ్లు దొరకడం చాలా అరుదైపోయింది. అన్నీ రసాయనాలతో పండించేవే. అరటిపండునుంచి మామిడి పండ్ల వరకూ అన్నీ రసాయనాలతోనే ముగ్గబెడుతున్నారు. దీంతో రుచి కాదుకదా.. పళ్లనుంచి లభించే సహజ పోషకాలు కూడా కోల్పోతున్నాయి. దీంతో అవి తిన్నా అంత ఉపయోగకరంగా ఉండటంలేదని చెప్పవచ్చు. అరటి పళ్లను సామాన్యుడి యాపిల్ గా చెబుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో సరైన అరటిపండ్లను కొనడం ఓ సవాలే. ఎందుకంటే సాధారణంగా పైకి నిగనిగలాడుతూ పసుపుపచ్చ రంగులో కనిపించినా తీరా తొక్క తీసి చూస్తే మాత్రం లోపల పచ్చిగా ఉంటాయి. చాలా మంది వ్యాపారులు రసాయనాలతో అరటి గెలలను మగ్గబెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. అయితే అరటి పళ్లను సహజంగా ఎలా మగ్గబెట్టాలో ఓ పెద్దావిడ చేసి చూపించారు. ఆమె అరటిగెలను మగ్గబెట్టిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం రెండు రోజుల్లోనే పచ్చి అరటి గెల కాస్తా సహజ పద్ధతిలో పసుపు రంగులోకి మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో దక్షిణ భారతదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన పెద్దావిడ అరటి తోటలోంచి ఓ పెద్ద పచ్చి అరటి గెలను కోసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని ఓ గొయ్యి తీసి అందులో పెట్టారు. ఓ చిన్న గిన్నెలో పిడకలకు నిప్పు అంటించి గెల పక్కనే ఉంచి, పైన అరటిఆకులు, కొబ్బరాకులు కప్పి, దానిపైన తిరిగి మట్టితో పూడ్చారు. రెండు రోజుల తర్వాత తిరిగి గోతిని తవ్వి చూడగా ఆశ్చర్యకరంగా పచ్చి అరటిగెల కాస్తా పసుపుపచ్చ రంగులోకి మారిపోయింది. దీంతో ఆ గెలను పైకి తీసి శుభ్రపరిచిన ఆ పెద్దావిడ ఓ పండును తీసుకొని రుచి చూసి మరీ అమ్మకానికి మార్కెట్‌కు పంపించారు. పెద్దావిడ చిట్కాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదికదా అసలైన అరటిపండు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌కు దరఖాస్తులు.. అర్హతలు ఇవే

Chat GPT: అత్యాధునిక ఫీచర్లతో చాట్ జీపీటీ-4ఓ.. అందరికీ ఫ్రీ

బైక్‌పై ఎలుగుబంటి సరదా సరదాగా షికారు.. వీడియో నెట్టింట ఫుల్ వైరల్