AP News: ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే ప్రకంపనలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Jul 19, 2024 02:09 PM