పాపకు కానుకగా బుర్జ్‌ ఖలీఫాలో ఫ్లాట్‌! వైరల్‌గా వీడియో

Updated on: Sep 01, 2025 | 9:09 PM

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం శ‌క్తి మేర‌కు కూడ‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు త‌మ వార‌సుల‌కు ఇచ్చేందుకు క‌ష్ట‌ప‌డుతుంటారు. దుబాయ్‌కు చెందిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ జంట త‌మ పసిపాప కోసం అపురూప కానుక‌ను సిద్ధం చేశారు.ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వనం బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. త‌మ పాప భ‌విష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో వీరిపై నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభ‌ర్త‌లు. ఐకానిక్ బిల్డింగ్‌ బుర్జ్ ఖలీఫాలో త‌మ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ పాప‌తో క‌లిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ఈ వీడియోకు 5 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ వ‌చ్చాయి. పెద్ద‌య్యాక త‌మ కూతురికి ఆర్థిక స‌మ‌స్య‌లు లేకుండా చేయాల‌న్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామ‌ని నోరా వెల్ల‌డించారు. త‌మ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్‌తో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశామ‌ని, త‌మ బిడ్డ పెద్ద‌య్యే నాటికి మొత్తం చెల్లించేస్తామ‌ని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన త‌ర్వాత అద్దెకు ఇస్తామ‌ని, త‌మ కూతురు పెద్దైన త‌ర్వాత అందులో ఉండాలనుకుంటే ఉంటుంద‌న్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబ‌ట్టి దీని విలువ భ‌విష్య‌త్తులో బాగా పెరుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియ‌న్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. దుబాయిలోని బుర్జ్ ఖలీఫాలో మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కి కూడా అపార్ట్‌మెంట్స్ ఉన్నాయంటూ గతంలో రూమర్స్ వచ్చాయి.కానీ వీటిపై వారెవరూ స్పందించకపోవటంతో అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. చాన్నాళ్ల క్రితమే మలయాళ నటుడు మోహన్ లాల్ 29వ ఫ్లోర్‌లో తన భార్య పేరు మీద ఒక సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశారు. గత కొన్నాళ్లుగా మనదేశానికి చెందిన పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు దుబాయ్‌లో పెట్టుబడులు పెడుతూ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాంటిన్‌ టీ తాగి.. కుప్పకూలిన మెడికో

ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి.. ఇప్పుడు అంత్యక్రియలు

దెయ్యం పట్టిందని భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తరువాత సీన్‌ ఇదే

భార్య ‘బంగారం’ కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్‌ 7న డోంట్‌ మిస్‌