అప్పుడే ఇంట్లోకి వచ్చిన యజమాని.. వయ్యారంగా నడిచి వెళ్లి స్వాగతం చెప్పిన డాగీ

|

Jul 11, 2022 | 9:37 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. కొన్ని ఫన్నీగా, మరి కొన్ని సెంటిమెంటల్ గా, ఇంకొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. కొన్ని ఫన్నీగా, మరి కొన్ని సెంటిమెంటల్ గా, ఇంకొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఇటీవల జంతువులకు సంబంధించిన వీడియోలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు. ఇక జంతువుల్లో కుక్కలకు ఉండే క్రేజే వేరు. అవి మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉంటాయి. ప్రస్తుతం ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న వీడియోలో, యజమాని ఇంట్లోకి రాగానే అతని పెంపుడు కుక్క ఆనందంతో తోక ఊపుతూ ఎంతో వయ్యారంగా నడుస్తూ అతని దగ్గరకు వస్తుంది. ఈ క్లిప్ చూస్తుంటే ఓ మోడల్‌ని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కుక్క తన యజమాని వద్దకు చేరుకోగానే, ఆ వ్యక్తి కుక్కను ఆప్యాయంగా తాకగా, కుక్క అక్కడే పడుకుంటుంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అది చూసిన నెటిజన్లు కుక్కను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఈ కుక్క నిజంగా అద్భుతంగా ఉందని, తాము దానితో ప్రేమలో పడ్డామని ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ డాగీ ఫ్యాషన్ షోలో పాల్గొనాలని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ బండబడా.. ప్రాణమంటే అంత చులకనా.. ఈ డేంజర్‌ ప్రయాణం తగదంటున్న నెటిజనం

ఆరు పదుల వయసులోనూ అద్భుతమైన గొంతు.. అచ్చం లతా మంగేష్కర్‌లా

మూడు నెలల్లో 33 సార్లు.. ఈమె కటాల్సిన చలాన్‌ డబ్బుతో ఓ లగ్జరీ ఇల్లు కొనొచ్చట

Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని కెలికితే అలాగే ఉంటుంది మరి.. ఏమి చేసిందో మీరు ఓ లుక్ వేయండి

Viral Video: నడి రోడ్డుపై వరద నీటిలో యువకుడు చిల్‌.. వీడియో చూశారంటే నవ్వకుండ ఉండలేరు..

Published on: Jul 11, 2022 09:37 AM