సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!
గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌కు సమీప గ్రామాలలో తరచూ పులులు, సింహాలు సంచరించటం మనం చూస్తుంటాం. జనావాసాల్లోకి వచ్చిన పులులు, సింహాలను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటారు. అర్ధరాత్రి వీధుల్లో పులులు, సింహలు గుంపులుగా సంచరించే..
గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌కు సమీప గ్రామాలలో తరచూ పులులు, సింహాలు సంచరించటం మనం చూస్తుంటాం. జనావాసాల్లోకి వచ్చిన పులులు, సింహాలను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటారు. అర్ధరాత్రి వీధుల్లో పులులు, సింహలు గుంపులుగా సంచరించే దృశ్యాలు పలుమార్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా ఓ గ్రామంలో సింహం చొరబడింది. అక్కడ పశువులను వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ సింహాన్ని గమనించిన ఓ వీధి శునకం ఆవులను ఆ సింహం బారినుంచి కాపాడింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట చేరి వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఒక గ్రామ రహదారిపై భయంతో పశువుల మంద పరుగులు తీస్తోంది. ఇంతలో ఓ కుక్క మొరుగుతూ మందను వెంబడిస్తూ కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే, కుక్క అసహనంగా మొరుగుతూనే ఉంది. గమనిస్తే వెనుకనుంచి ఎవరో ఈ శునకాన్ని వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. అది ఒక సింహం..అది శునకాన్ని సమీపిస్తుండగా శునకం పెద్దగా మొరుగుతూ పరుగందుకుంది. అప్పుడు గానీ, అర్థం కాలేదు.. సింహం బారినుండి వీధి కుక్క పశువుల మందను కాపాడుతూ పరిగెత్తిస్తుందని, ఆ కుక్క వెనుకుండి పశువుల మందను సింహం నుండి దూరంగా నడిపిస్తుందని తెలిసిన తర్వాత నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఈ వీడియోను రెండు మిలియన్లమందికి పైగా వీక్షించారు. తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచినీళ్లకోసం రైలుదిగాడు.. కట్‌చేస్తే 22 ఏళ్లకు ఇంటికి చేరాడు
20 ఏళ్ల కింద చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు !!
కోడి పిల్లలతో కుక్క స్నేహం.. నెటిజన్ల ప్రశంసలు
6000 అడుగుల ఎత్తునుంచి కింద పడి.. 72 గంటలు నరకయాతన
Balagam: స్టార్ డైరెక్టర్ ఫిల్మ్‌లో కీ రోల్.. బంపర్ ఆఫర్ కొట్టిన బలగం పాప !!