బీచ్‌లో ఫుడ్‌బాల్ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
శునకాలు మనుషులకు అత్యంత సన్నిహితంగా, స్నేహంగా మెలగుతాయి. ఏది చెప్పినా త్వరగా నేర్చుకుంటాయి. యజమానితో కలిసి ఆటలాడతాయి, ఆసరాగా నిలబడతాయి. తన యజమానికి రక్షణగా నిలబడతాయి. అలాంటి ఓ శునకం తన యజమానితో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బ్రెజిల్ లోని ఓ బీచ్ లో ఓ వ్యక్తి తన పెంపుడు శునకంతో కలిసి ఫుట్ బాల్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి బాల్ వేసిన కొద్దీ శునకం తన తలతో సరైన పొజిషన్ లోకి కొట్టిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన యజమానితో పోటాపోటీగా తలపడిన ఆ శునకం ఒక్క బాల్ కూడా వదల్లేదు. ఎంతో అద్భుతంగా డిఫెన్స్ చేస్తూ బంతిని ఎదుర్కొంది. ఆఖరికి తన యజమాని అలసిపోయాడే కానీ ఈ శునకం మాత్రం తగ్గలేదు. చివరికి యజమాని బంతికి పక్కకు విసిరి శునకాన్ని ఎత్తుకొని మెచ్చుకుంటూ.. ఇక చాలు వెళ్లమంటూ కిందకు దింపగానే తనదారిన వెళ్లిపోయింది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికిపైగా వీక్షించారు. వేల కొద్దీ లైకులు కూడా వచ్చాయి. నిజానికి ఈ వీడియో పాతదే అయినా… తాజాగా మరోసారి వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంత వైల్డ్ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే ??
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్.. కానీ ఇక్కడ ట్విస్ట్ తెలిస్తే మీ మతిపోతుంది !!
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే