Dog dance: దీని వేషాలు మామూలుగా లేవుగా.. నా రూటే వేరంటున్న కుక్క.. ట్రెండ్ అవుతున్న వీడియో..

|

Jul 26, 2022 | 5:01 PM

ప్రపంచంలో శునక ప్రేమికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, వాటిని కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరిస్తారు. అయితే ఈ పెంపుడు కుక్కలు


ప్రపంచంలో శునక ప్రేమికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, వాటిని కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరిస్తారు. అయితే ఈ పెంపుడు కుక్కలు ఒక్కోసారి యజమానికి విసుగు కలిగించినా.. మరికొన్ని సార్లు వాటి చేష్టలు ఆనందం కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో అలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ చిన్న కుక్క.. పింక్ టవల్ మెడకు కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. కెమెరాను చూపించగానే అది అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అచ్చం మనిషి లాగే రెండు కాళ్లపై గిరగిరా తిరుగుతూ సూపర్‌గా స్టెప్పులేసింది. ఈ వీడియో ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను నాలుగు లక్షల మంది వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. ఈ కుక్క నిజంగా అందంగా ఉంది.. సూపర్‌గా డాన్స్‌చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్యూట్‌ వీడియోను పలువురు యూజర్లు షేర్‌ చేస్తున్నారు కూడా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 26, 2022 05:01 PM