ఆపరేషన్ చేశారు.. కడుపులో కత్తెర వదిలేశారు
కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేశారు. కానీ, కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితు రాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఎక్సరే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. గర్భిణికి ఏప్రిల్ 19న సర్జరీ జరిగింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేసి.. పండంటి బిడ్డను బయటకు తీశారు. అయితే కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు.
కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేశారు. కానీ, కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితు రాలు కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఎక్సరే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. గర్భిణికి ఏప్రిల్ 19న సర్జరీ జరిగింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేసి.. పండంటి బిడ్డను బయటకు తీశారు. అయితే కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. దీంతో ఆమె 3 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆమెకు తీసిన ఎక్స్‌రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే సంబంధిత ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆయన ఆ పోస్టులను తొలగించాడు. కడుపులో కత్తెర ఘటనపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. బాధ్యులైన వారిని విధుల నుంచి తొలగిస్తామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ బాబోయ్..! అరటి పండు కూడానా.. సెంచరీ కొట్టింది
దోమను చంపబోయి ఆస్పత్రిలో పడ్డ వ్యక్తి !!
బ్రతకదు అనుకున్న భార్యకు ప్రాణం పోసిన భర్త
పుష్పాను మరిపించే రియల్ సీన్.. ఆ ఒక్కటి తప్పా.. అంతా సేమ్ టూ సేమ్
స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్ మిస్.. లేదంటే ??