Know This: తమ పిల్లలు చనిపోతే కోతులు ఏమి చేస్తాయో తెలుసా..! వీడియో
మనుషులే కాదు జంతువులు కూడా ఎమోషన్స్ ఉంటాయి. తమ పిల్లలు చనిపోయినా, సాటి జంతువులు చనిపోయానా అవి చాలా బాధ పడతాయి. వాటికి ఆ బాధనుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట.
మనుషులే కాదు జంతువులు కూడా ఎమోషన్స్ ఉంటాయి. తమ పిల్లలు చనిపోయినా, సాటి జంతువులు చనిపోయానా అవి చాలా బాధ పడతాయి. వాటికి ఆ బాధనుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట. కోతులపై ఇటీవల జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. కోతులు తమ పిల్లలు చనిపోతే వాటిని ఎత్తుకుని నెలల తరబడి అలానే తిరుగుతూ ఉంటాయట. ఆ దుఃఖం నుంచి కోలుకోవడానికి వాటికి చాలాకాలం పడుతుందట. యూనివర్సిటీ కాలేజ్ లండన్ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగుచూసింది. కోతులు తమ చిన్నపిల్లల మరణాన్ని ఎలా ఎదుర్కొంటాయో అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు 50 జాతుల కోతులపై అధ్యయనం చేసారట. యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు 1915 నుండి 2020 వరకు తమ పిల్లలను పోగొట్టుకున్న కోతులు, బుష్ బేబీస్, లెమర్స్ ప్రవర్తనపై అధ్యయనం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Mahesh Babu: తన ఎనర్జీ సీక్రెట్ చెప్పిన మహేష్ బాబు.. వీడియో
Viral Video: రియల్ బాహుబలి.. క్వింటాళ్ళకొద్దీ బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు.. వీడియో