కార్తీకమాసం అద్భుతం.. శివయ్య దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు

Updated on: Nov 19, 2025 | 4:32 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో కార్తీక మాసంలో నాగుపాము దర్శనమిచ్చింది. శివలింగం వద్ద పడగ విప్పిన ఈ సంఘటనను భక్తులు దైవ మహిమగా భావించారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాగేంద్రుడు స్వయంగా శివయ్యను దర్శించుకున్నాడని భక్తులు పేర్కొంటున్నారు.

ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో నాగుపాము దర్శనమిచ్చింది.. ఆలయానికి వచ్చిన భక్తులు పుట్టవద్ద కనిపించిన ఆ నాగుపామును చూసి పూజలు చేశారు. అనంతరం కాసేపటికి తిరిగి పుట్టలోకి వెళ్లిపోయినట్టు భక్తులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు. కార్తికమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నామని, అదే సమయంలో నాగు పాము శివుడి దగ్గరకు చేరుకొని పడగ విప్పిందని.. ఆలయ అర్చకుడు శ్రీనివాసులు వివరించారు. ఇది దేవుని మహిమగా వివరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఆఖరి సోమవారానికి ముందు నాగేంద్రుడే స్వయంగా శివయ్య ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాడంటూ భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుడికి పూజలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక ఈ బ్యాంకులు కనిపించవా ?? ఎందుకు ఇలా చేస్తున్నారు ??

తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమజంట

ఫోర్బ్స్‌ కవర్‌ పేజీపై కోదాడ కుర్రాడు జానీ పాషా

Jr NTR: వెండితెర మీద 25 ఏళ్లు పూర్తి చేసుకున్న NTR

Arjun Kapoor: వరుస ఇబ్బందులతో డిప్రెషన్‌ లోకి వెళ్ళా.. ఇప్పుడు ఇలా..