Viral Weather: ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..

|

Oct 13, 2024 | 10:00 AM

అక్టోబర్ నెలలో సాధారణంగా చలి ఉంటుంది. ఇప్పుడు భిన్నమైన వాతవరణంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం ఎండలు చంపేస్తుంటే సాయంత్రం వర్షం కురుస్తుంది. ఆ వెంటనే చలి తీవ్రత ఉంటుంది. ఇక రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెరైటీ వాతవరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి వాతవరణం గతంలో ఎన్నడు చూడలేదంటున్నారు స్థానికులు.

ఉదయం 7 గంటలకు సూర్యుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత భరించలేకపోతున్నారు. వేడికి సతమతమవుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. ఇలాంటి వాతవరణం ఉంటోంది. 20 నిుషాలు బయటకు వెళ్తే చాలు.. శరీరం మొత్తం తడిచిపోతుంది. అంతేకాదు.. త్వరగా డిహైడ్రేషన్ కు గురి అవుతున్నారు.. తొందరగా అలిసిపోతున్నారు.

గ్రామాల్లో రైతులు ఈ వేడి కారణంగా పని చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు… పంటలు చేతికొచ్చే సమయం.. దీంతో.. చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు.. ఏమైనా కార్యక్రమాలు ఉంటే.. ఉదయం పది లోపే పూర్తి చేసుకుంటున్నారు. రాత్రి మొత్తం ఏసిలు తిరుగుతున్నా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడం లేదు. ఇలాంటి వాతవరణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on