ఖరీదైన కాఫీ..కిలో జస్ట్ రూ.25 లక్షలే

Updated on: Oct 19, 2025 | 12:28 PM

వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ మజానే వేరు. అందుకే చాలా మంది ఉదయం తమ రొటీన్‌ను కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే కాస్త పని ఒత్తిడిగా అనిపించినా, అలసటగా ఉన్నా కాఫీ తాగితే రిలీఫ్​ వస్తుందని చాలా మంది నమ్ముతారు. కొద్దిమంది బ్రేక్​ ఫాస్ట్ చేసిన తర్వాత తాగితే, మరికొందరు మాత్రం పరగడుపునే తాగుతుంటారు. ఇంట్లో కాఫీ లేకపోతే..బయటకు వెళ్లి మరీ తాగుతారు.

రోడ్డు వెంట స్టాల్‌లో కాఫీ రూ.20 వరకు ఉంది. ఇక..ఖరీదైన కేఫ్‌లకు వెళ్లి కాఫీ కోసం రూ.500 నుంచి రూ.600 చెల్లించి మరీ ఇష్టంగా తాగేవారు ఎందరో ఉన్న్నారు. అయితే..తాజాగా ఓ రకం కాఫీ .. ధర తెలుసుకుని కాఫీ ప్రియులు షాక్ అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన కాఫీగా పనామా గీషా కాఫీ నిలుస్తోంది. పశ్చిమ పనామాలోని బారు పర్వతంలోని పొలంలో పండే ఈ కాఫీ, దాని ప్రత్యేక వాసన, రుచి, పరిమిత ఉత్పత్తితో కాఫీ ప్రియులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. 2025లో జరిగిన పనామా వేలంలో, కేవలం 20 కిలోల గీషా గింజల బ్యాగ్‌ సుమారు రూ.5 కోట్లకు పైగా అమ్ముడైంది. అంటే కిలో ధర దాదాపు రూ.25 లక్షలు. ఈ కాఫీ గింజలను చేతితో సేకరించి, ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తారు. ఇక రోస్టర్స్‌ కాఫీ అద్భుత రుచికి వాసనకు ఫిదా అయ్యే వారి సంఖ్య తక్కువేం కాదు. కప్పు కాఫీ ధర 60 వేల రూపాయలు. ఈ కాఫీ తర్వాత తైవాన్‌కు చెందిన సింపుల్ కాఫా ధర ఎక్కువగా ఉంది. యూఏఈ, చైనా, సౌదీ, జపాన్, తైవాన్ దేశాలలో తరచూ కాఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాంటి పోటీల్లోనే అరుదైన కాఫీలు వెలుగులోకి వస్తుంటాయి. మొత్తంగా ఈ కాఫీ గురించి తెలుసుకున్న జనం… దీని ఖర్చుతో ఓ చిన్న పాటి వివాహం చేయవచ్చని అంటున్నారు. మరికొందరు అయితే పెద్ద విందునే ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి యువకుడి ఎమోషనల్ పోస్ట్

టోల్ గేట్లు.. ఇక కనుమరుగు రోడ్లపై కెమెరాలతో టోల్‌ వసూళ్లు

గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్.. ఇదేం క్రియేటివిటీ..

ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..

అమెరికా గ్రీన్ కార్డు .. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు